వచ్చేవారం నుంచి కరోనా వ్యాక్సిన్ క్యాంపెయిన్ షురూ!

ABN , First Publish Date - 2020-12-03T12:01:40+05:30 IST

వచ్చేవారం నుంచి రష్యాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనే ప్రచారాన్ని పారంభించాలని అధికారులకు...

వచ్చేవారం నుంచి కరోనా వ్యాక్సిన్ క్యాంపెయిన్ షురూ!

మాస్కో: వచ్చేవారం నుంచి రష్యాలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలనే ప్రచారాన్ని పారంభించాలని అధికారులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్ ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంపై పుతిన్ డిప్యూటీ పీఎం తాత్యానా గోలికోవాతో కూడా చర్చించారు. రష్యాలో తయారైన స్పుత్నిక్ వీ హ్యూమన్ ట్రయల్ సమయంలో కరోనాతో పోరాడటంలో 95శాతం ప్రభావవంతంగా ఉందని నిరూపితమైంది. ఈ టీకాను గమాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. రష్యా ప్రజలకు ఈ టీకాను ఉచితంగా అందించనున్నారు. ఇతర దేశాలలో దీని ధర 700 రూపాయల కన్నా తక్కువగా ఉండనుంది. ఈ ధర ఇతర వ్యాక్సిన్ల కంటే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. 


Updated Date - 2020-12-03T12:01:40+05:30 IST