అరెస్టు చేసి ఇంజెక్షన్లు గుచ్చుతాం: వ్యాక్సిన్ వద్దంటున్న వారికి దేశాధ్యక్షుడి హెచ్చరిక!

ABN , First Publish Date - 2021-06-22T23:12:21+05:30 IST

కరోనా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న సమయంలో కూడా వ్యాక్సిన్ వద్దంటున్న వారికి ఫిలిప్పైన్స్ దేశాధ్యక్షుడు హెచ్చరికలు చేశారు.

అరెస్టు చేసి ఇంజెక్షన్లు గుచ్చుతాం: వ్యాక్సిన్ వద్దంటున్న వారికి దేశాధ్యక్షుడి హెచ్చరిక!

ఫిలిప్పైన్స్: కరోనా ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న సమయంలో కూడా వ్యాక్సిన్ వద్దంటున్న వారికి ఫిలిప్పైన్స్ దేశాధ్యక్షుడు హెచ్చరికలు చేశారు. కరోనా ప్యాండెమిక్‌ను దేశంలో జాతీయ ఎమర్జెన్సీగా అభివర్ణించిన ఆయన.. వ్యాక్సిన్ వద్దనే వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు. ‘‘మీరు గనుక వ్యాక్సిన్ తీసుకోలేదంటే.. మిమ్మల్ని అరెస్టు చేపించి, ఆ తర్వాత మీ పిరుదులకు వ్యాక్సిన్ ఇంజెక్షన్లు చేపిస్తా’’ అని ప్రెసిడెంట్ రోడ్రిగో డ్యూటెర్టె  స్పష్టం చేశారు. ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, లేదంటే అరెస్టు చేసి జైల్లో పెట్టిస్తానని చెప్పారు. అలాగే వ్యాక్సిన్ వద్దనుకునేవాళ్లు దేశంలో ఉండొద్దన్న ఆయన.. కావాలంటే భారత్‌కో లేక అమెరికాకో ఎక్కడో ఒక చోటకు వెళ్లిపోవాలని సూచించారు. ఫిలిప్పైన్స్‌లో ఇప్పటి వరకూ 13 లక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2021-06-22T23:12:21+05:30 IST