ప్రతిష్ఠాత్మక పోరు

ABN , First Publish Date - 2021-02-23T04:43:18+05:30 IST

గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి..

ప్రతిష్ఠాత్మక పోరు
సీఎం కేసీఆర్‌ సమక్షంలో హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థితో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రి, టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిదులు

- ఆసక్తికరంగా మారిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌

- టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ప్రధాని పీవీ కుమార్తెకు పోటీకి చాన్స్‌

- వాణీదేవి బరిలోకి రావడంతో మారిన సీన్‌

- ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకూ సవాల్‌

- రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం


(మహబూబ్‌నగర్‌-ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.. బరిలో హేమాహేమీలు దిగడంతో, ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాంగ్రెస్‌ నుంచి చిన్నారెడ్డి ఇప్పటికే పోటీలో ఉండగా, అధికార పార్టీ తన అభ్యర్థిని ప్రకటించడంలో పక్కా వ్యూహాన్ని అనుసరించింది.. అనూహ్యంగా మాజీ ప్రధానీ పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవిని తమ క్యాండెట్‌గా ప్రకటించి, ఆసక్తికర పోరుకు తెరలేపింది.. స్వతంత్ర అభ్యర్థులూ బలమైన వారే కావడంతో, ఈ ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది..

శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌న గర్‌ నియోజకవర్గంలో పోటీపై చివరి వరకు స స్పెన్షన్‌ను కొనసాగించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎవ రూ ఊహించని వ్యక్తిని అభ్యర్థిగా తెరమీదకు తీసుకొచ్చింది. మాజీ ప్రధాన మంత్రి పీవీ న రసింహారావు కుమార్తె వాణీదేవిని బరిలో నిలు పుతున్నట్లు ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆ ర్‌ ప్రకటించారు. సోమవారం ఈ నియోజకవర్గం లోని మూడు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వాణి దేవిని వారికి పరిచయం చేసి, ఆమెకు బీపారం అందజేశారు. ఆమె గెలుపు బాధ్యతను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భుజ స్కందాలపైనే ఉంచిన సీఎం, గెలుపే లక్ష్యంగా పని చేయాలని నిర్దేశించారు. కాగా, పీవీ శత జయంత్యుత్సవాలు జరుగుతున్న సందర్భంలో వస్తున్న ఈ ఎన్నికల్లో, ఆయన కుమార్తెనే తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారా కాం గ్రెస్‌కు ఇరుకున పెట్టే వ్యూహానికి టీఆర్‌ఎస్‌ తెరదీసినట్లైంది.

- టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వాణీదేవి పోటీలోకి రావడంతో బలమైన పోటీకి తెరలేచింది. బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎ మ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు పోటీలో ఉండగా, ఆయన ఇప్పటికే ఒక పర్యాయం ఈ నియోజకవర్గాన్ని చుట్టి వ చ్చారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత జీహె చ్‌ఎంసీతో కూడిన ఈ నియోజకవర్గంలో గెలవడం ద్వారా, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమ నే బలమైన సంకేతాలివ్వాలనే లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఇప్పటికే ఎన్నికల ప్ర చారంలోకి దిగిపోవడం ద్వారా, క్యాడర్‌ను అప్రమత్తం చేస్తుండటం ఈ ఎన్నికపై ఆ పార్టీ అంచనాలను తెలియజేస్తోంది. 

- కాంగ్రెస్‌ నుంచి బరిలో నిలిచిన చిన్నారెడ్డి మూడు జిల్లాల ప్రజ లకు సుపరిచితుడు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ జాతీ య, రాష్ట్ర కమిటీల్లో బాధ్యతల్లో ఉన్న నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకత్వం యావ త్తూ ఎకతాటిపైకి వచ్చి, ఎక్కిడికక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఎ న్నిక రాష్ట్ర రాజకీయాలకు మలుపుగా చెబుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు బుద్ధి చెప్పేలా పట్టభద్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ప్ర చారం చేస్తున్నారు. 

- తెలుగుదేశం పార్టీ నుంచి టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ పోటీలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతును కూడగట్టేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నారు. ఈయనను ఎన్నికల్లో గెలిపించుకోవడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 

- ఈ స్థానం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా గెలుపొందిన ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ సైతం మరోసారి తన వాణిని వినిపిస్తానంటూ పోటీ కి దిగారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యం లో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిర్ణయాలను అడ్డుకునే ప్రజాగొంతుకగా ఉండాలనే ఉద్దేశ్యంతో తాను బరిలోకి దిగినట్లు నాగేశ్వర్‌ స్పష్టం చేస్తున్నారు. 

- ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల మద్దతుతో టీపీఆర్‌టీయూ వ్యవస్థా పక అధ్యక్షుడు, కాంగ్రెస్‌ నుంచి టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ జి.హర్షవర్ధన్‌రె డ్డి ఇండిపెండెంట్‌గా పోటీలో నిలిచారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కని కా రణంతో ఆయన సోమవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా లేఖను సమ ర్పించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సమస్యలపై, వారి తరుపున పోరాడేందుకే తాను బరిలో ఉంటున్నానని స్పష్టం చేశారు.

Updated Date - 2021-02-23T04:43:18+05:30 IST