బాల్య వివాహాలను అరికట్టాలి

ABN , First Publish Date - 2022-07-02T05:25:59+05:30 IST

జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు.

బాల్య వివాహాలను అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ ఆనంద్‌

  జాయింట్‌ కలెక్టర్‌ ఆనంద్‌

పార్వతీపురం - ఆంధ్రజ్యోతి, జూలై 1 : జిల్లాలో బాల్య వివాహాలను అరికట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఒ.ఆనంద్‌  ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో   జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  బాల్య వివాహాల నివారణకు మహిళా శిశు సంక్షేమ, ఆరోగ్య, విద్యా,  పోలీస్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తే.. చట్ట ప్రకారం కఠిన శిక్షలు అమలు చేయనున్నట్లు హెచ్చరించారు. జిల్లాలో బాల్య వివాహాలపై కనీసం 24 గంటలు ముందుగా సీడీపీవోలు, చైర్డ్‌లైన్‌ విభాగానికి సమాచారం అందించాలని , లేకుంటే క్షేత్రస్థాయి సిబ్బందిపై క్రమ శిక్షణా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాల్య వివాహాల నివారణ కమిటీ గ్రామస్థాయిలో పక్కాగా పనిచేయాలని, ప్రతి మూడు నెలలకు  సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. డీఎస్పీ ఎ.సుభాష్‌ మాట్లాడుతూ.. పాచిపెంట, సాలూరు, బలిజిపేట, పార్వతీపురం, కొమరాడ మండలాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం   పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ జి.వరహాలు, డీఎంహెచ్‌వో బి.జగన్నాఽథరావు, ఇన్‌చార్జి డీఈవో పి.బ్రహ్మాజీరావు, చైల్డ్‌లైన్‌ కౌన్సిలర్‌ జీకే దుర్గ  తదితరులు పాల్గొన్నారు. 

   

Updated Date - 2022-07-02T05:25:59+05:30 IST