చటాకాయలో అక్రమ చేపల చెరువు గట్లను ధ్వంసం చేస్తున్న అటవీ శాఖ సిబ్బంది
కొల్లేరులో చెరువు గట్ల ధ్వంసం
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
కైకలూరు, మార్చి 27 : కొల్లేరు అభయారణ్యంలో చేపల చెరువుల అక్రమ తవ్వకాన్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. కైకలూరు మండలం చటాకాయ గ్రామాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకంటూ కొందరు అక్రమంగా చేపల చెరువుల తవ్వకాన్ని చేపట్టారు. దీనిపై ‘కట్టుబాట్ల కట్ట కట్టి’ అనే శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై అటవీశాఖ అధికారులు స్పందించారు. వెంటనే తవ్వకాలను నిలిపివేయించారు. డిప్యూటీ రేంజర్ జయప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది చెరువుగట్లను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టినా కేసులు నమోదు చేస్తామని గ్రామ పెద్దలను హెచ్చరించారు.