ఇసుక దోపిడీ, దౌర్జన్యాలను అరికట్టండి

ABN , First Publish Date - 2022-01-26T05:39:13+05:30 IST

జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కొండాపురం వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీ, దౌర్జన్యాలను అరికట్టాలని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు.

ఇసుక దోపిడీ, దౌర్జన్యాలను అరికట్టండి
విలేకరులతో మాట్లాడుతున్న కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, ఎమ్మెల్సీ శివనాథరెడ్డి

టీడీపీ నాయకులు

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 25: జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కొండాపురం వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీ, దౌర్జన్యాలను అరికట్టాలని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.  మల్లెల లింగారెడ్డి మాట్లాడుతూ అక్రమాలు, దోచుకోవడం వైసీపీకి అలవాటుగా మా రిందన్నారు. ఇసుక విషయంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కొండాపురంలోని పొట్టిపాడు, అనంతపురం, చిత్రావతినదిలో ఆ ప్రాం తానికి చెందిన వైసీపీ నాయకులు దోచుకుంటున్నారన్నారు. లారీకి 18 టన్నులు లోడు చేయాల్సి ఉండగా 25 టన్నులు చేస్తున్నారన్నారు.  పొట్టిపాడు వద్ద ఇసుక దోపిడీ జరుగుతున్నా అధికారులు నోరు మెదపడంలేదన్నారు.  ఎమ్మెల్సీ శివనాథరెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజకవర్గంలో పెన్నానదిలో మంచినీటి బోర్ల వద్ద ఇసుక తరలిస్తున్నారని, అధికారులకు సమస్య తెలిపినా పట్టించుకోవడంలేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ గత వర్షాలలో ఇసుక వచ్చిందని, పునరావాసులకు హామీలు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. వైసీపీ దౌర్జన్యానికి అధికారులు కూడా అడ్డు చెప్పలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి , తెలుగురైతు ప్రధాన కార్యదర్శి పొన్నతోట శ్రీనివాసులు, రైతు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, కిరణ్‌రాయల్‌, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీకి పోగాలం దగ్గరపడింది : మల్లెల లింగారెడ్డి

వైసీపీకి పోగాలం దగ్గరపడిందని మల్లెల లింగారెడ్డి విమర్శించారు. మంగళవారం జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రి కొడాలి నాని ఒక్కరే వైసీపీకి అడ్రస్‌ లేకుండా చేస్తారన్నారు. ఆయన మాట్లాడే భాష, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు.  ఉద్యోగ సంఘాలకు పీఆర్‌సీ పేరుతో ఎప్పుడూ లేని దొంగలెక్కలు వేసుకుని మోసం చేశారన్నారు.  

Updated Date - 2022-01-26T05:39:13+05:30 IST