క్రోమ్‌ ఓపెన్‌ చేయడానికి ముందే వెబ్‌సైట్‌ ప్రీవ్యూ

ABN , First Publish Date - 2021-03-13T05:49:10+05:30 IST

గూగుల్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. దీని సహాయంతో పూర్తిగా ఓపెన్‌ చేయడానికి ముందే వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు. అనవసర పేజీలు ఓపెన్‌ చేయకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు గూగుల్‌ క్రోమ్‌ ఈ

క్రోమ్‌ ఓపెన్‌ చేయడానికి ముందే వెబ్‌సైట్‌ ప్రీవ్యూ

గూగుల్‌ సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది. దీని సహాయంతో పూర్తిగా ఓపెన్‌ చేయడానికి ముందే వెబ్‌సైట్‌ను వీక్షించవచ్చు. అనవసర పేజీలు ఓపెన్‌ చేయకుండా ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్‌ వినియోగదారులకు గూగుల్‌ క్రోమ్‌ ఈ వెసులుబాటును కల్పిస్తోందని ‘9 టు 5 గూగుల్‌’ తెలియజేసింది. వెబ్‌సైట్‌ లింక్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేస్తే ‘ప్రీవ్యూ పేజ్‌’ కనిపిస్తుంది. ‘ఓపెన్‌ టు ఇన్‌కాగ్నిటో ట్యాబ్‌’ - ‘కాపీ లింక్‌ అడ్రస్‌’ మధ్యలో ఇది ఉంటుంది. యూజర్‌ ట్యాప్‌ చేయగానే పాపప్‌ షీట్‌పై ప్రత్యేకించిన లింక్‌ మొత్తంగా కవర్‌ అవుతూ ఓపెన్‌ అవుతుంది. పేజీకి కుడి పక్కన పైభాగంలో బార్‌ కనిపిస్తుంది. లింక్‌ను కంప్లీట్‌గా ఓపెన్‌ చేసేందుకు అవసరమైన పేజీ పేరు, డొమైన్‌, ఐకాన్‌తో సమస్త సమాచారం అక్కడ ఉంటుంది. సర్వర్‌సైడ్‌ నుంచి సపోర్ట్‌ ద్వారా ఈ వెసులుబాటు క్రోమ్‌ 89లో అందుబాటులోకి వస్తోంది. 

Read more