మరో Indian American ను కీలక పదవికి నామినేట్ చేసిన Biden

ABN , First Publish Date - 2021-10-16T16:45:08+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన బృందంలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు గురువారం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌లో ఓ కీలక పదవికి భారత సంతతి వ్యక్తి పేరును అధ్యక్షుడు ప్రతిపాదించారు. ఇంతకుముందు యూఎస్ వాయుసేనలో ఎయిర్‌ ఫోర్స్ అధికారిగా పనిచేసిన..

మరో Indian American ను కీలక పదవికి నామినేట్ చేసిన Biden

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన బృందంలో మరో భారతీయ అమెరికన్‌కు కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. ఈ మేరకు గురువారం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌లో ఓ కీలక పదవికి భారత సంతతి వ్యక్తి పేరును అధ్యక్షుడు ప్రతిపాదించారు. ఇంతకుముందు యూఎస్ వాయుసేనలో ఎయిర్‌ ఫోర్స్ అధికారిగా పనిచేసిన రవి చౌదరి అనే ఇండో-అమెరికన్‌ను పెంటగాన్‌లోని ‘ఎయిర్‌ఫోర్స్‌ ఫర్‌ ఇన్‌స్టల్లేషన్స్‌ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌’ విభాగానికి అసిస్టెంట్‌ సెక్రటరీ పదవికి నామినేట్ చేశారు. బైడెన్‌ ప్రతిపాదనను అమెరికన్ సెనేట్‌ ఆమోదిస్తే రవి చౌదరి ఆ బాధ్యతలు చేపడతారు. గతంలో ఆయన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ)లో అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్స్‌ ఇన్నోవేషన్‌ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేశారు. 


ఈ హోదాలో ఎఫ్‌ఏఏ వాణిజ్య అంతరిక్ష ప్రయాణాలపై జరుగుతున్న పరిశోధనలకు నేతృత్వం వహించారు. 1993-2015 వరకు వాయుసేనలో వివిధ హోదాల్లో పనిచేశారు. అలాగే వ్యోమగాముల భద్రత కోసం నాసాతో కూడా కలిసి పనిచేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో ఏషియన్‌ అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ కమిషన్‌కు సలహాదారుగా కూడా విధులు నిర్వహించారు. ఇదిలాఉంటే.. ఇప్పటికే జో బైడెన్ పరిపాలన బృందంలో 50 మందికి పైగా భారతీయ అమెరికన్లు పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి రవి చౌదరి చేరబోతున్నారు. 

Updated Date - 2021-10-16T16:45:08+05:30 IST