Droupadi Murmu 15వ రాష్ట్రపతిగా అపూర్వ విజయం..

ABN , First Publish Date - 2022-07-22T01:37:39+05:30 IST

న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన మ్యాజిక్ నెంబర్ ఓట్లను ఆమె ఇప్పటికే సాధించారు.

Droupadi Murmu 15వ రాష్ట్రపతిగా అపూర్వ విజయం..

న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు కావాల్సిన మ్యాజిక్ నెంబర్ ఓట్లను ఆమె సాధించారు. రాష్ట్రపతి అయ్యేందుకు కావాల్సిన ఓట్ల విలువ 5,28,491 కాగా ద్రౌపది ముర్ముకు తొలి ప్రాధాన్యతా ఓట్లు 2824 వచ్చాయి. వీటి విలువ 6,76,803. మరోవైపు విపక్షాల అభ్యర్ధి యశ్వంత్ సిన్హా(Yashwant Sinha) కు మూడో రౌండ్ ముగిసేసరికి 1058 ఓట్లు వచ్చాయి. వీటి విలువ 2,61, 062. ద్రౌపది ముర్ముకు వచ్చిన తొలి ప్రాధాన్యతా ఓట్లను బట్టి ఆమె రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ మీడియాకు వెల్లడించారు. ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ కూడా అందజేశారు. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. 






ముర్ముకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా అభినందనలు తెలిపారు. 


ముర్ము విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. 








ముర్ముకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు. 



Updated Date - 2022-07-22T01:37:39+05:30 IST