అలివితో విలవిల

ABN , First Publish Date - 2022-01-18T04:35:54+05:30 IST

ఏటి తల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న జాలర్ల జీ వితాలు దుర్భరంగా మా రుతున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో చెంచులు, జాలర్ల అమా యకత్వాన్ని ఆసరాగా చేసుకొని స్థానిక నేతలతో పాటు ఆంరఽధా కాంట్రాక్టర్లు యథేచ్ఛగా మత్స్య సంపదను దోచేస్తున్నారు.

అలివితో విలవిల
అలివి వలలను కృష్ణా నదిలో దించుతున్న కూలీలు

కృష్ణానది తీరంలో చేపల మాఫియా ఆగడాలు

యథేచ్ఛగా నిషేధిత అలివి వలల వినియోగం

తరాలుగా చేపల వేటను నమ్ముకున్న వారికి పస్తులు

అధికార పార్టీ నాయకుల అండదండలతో అరాచకం


నాగర్‌కర్నూల్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : ఏటి తల్లిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న జాలర్ల జీ వితాలు దుర్భరంగా మా రుతున్నాయి. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో చెంచులు, జాలర్ల అమా యకత్వాన్ని ఆసరాగా చేసుకొని స్థానిక నేతలతో పాటు ఆంరఽధా కాంట్రాక్టర్లు యథేచ్ఛగా మత్స్య సంపదను దోచేస్తున్నారు. ఈ క్రమంలో నిషేధిత అలివి వలలను వినియోగిస్తున్నప్పటికీ రెవెన్యూ, పోలీసులు, మత్స్య శాఖ అధికారులు చోద్యం చూస్తూ రోజు వారి, నెలవారి మామూళ్ల కోసం పేద జాలర్లను పట్టెడు అన్నానికి దూరం చేస్తున్నారు. 


అన్నీ తెలిసినా స్పందన కరువు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణానది దాదాపు 120 కిలో మీటర్ల దూరం ప్రవహిస్తోంది. నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట నియోజకవర్గాల్లో 10 వేల జాలర్ల కుటుంబాలు కేవలం చేపల వేట ప్రధాన వృత్తిగా జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే వీరంతా సంప్రదాయమైన వలలను వినియోగిస్తూ పొట్ట కోసం తాపత్రయపడుతుండగా కృష్ణానదిలో ఉన్న అపారమైన మత్స్య సంపదను దోచుకునేందుకు ఇక్కడి నాయకులు కన్నేశారు. ఈ క్రమంలో ఆంరఽధాకు చెందిన కాంట్రాక్టర్లను రంగంలోకి దించి వారితో లక్షల్లో అగ్రిమెంట్‌ కుదుర్చుకొని అలివి వలల అక్రమ వినియోగానికి దారులు తెరుస్తున్నారు. గ్రామ స్థాయిలో ఎవరైనా అడ్డొస్తే నయానోభయానో లొంగదీసుకోవడంతోపాటు అధికారుల దాడులను ముందుగానే దళారులకు చేరవేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు. 


గుడ్డుతో సహా నాశనం

చేపల మాఫియా కృష్ణానదిలో వినియోగిస్తున్న అలివి వలలతో చేపల గుడ్డుతో సహా నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. కృష్ణానదిలో బొచ్చలు, రవుట, జెల్లలు, పిలైచిలు ఏడాదికి సహజమైన చేపల వేట ద్వారా 8 నుంచి 10 టన్నులు రావాల్సి ఉంది. అయితే రాజకీయ నాయకులు, చేపల మార్కెటింగ్‌ కేంద్రాలతో కుమ్మక్కు కావడంతో చెంచులకు కూడా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. అమరగిరి, మల్లేశ్వరం, మంచాలకట్టలో చేపల వేట కొనుగోలు, అమ్మకం వ్యవహారాల్లో జాలర్ల ప్రమేయాన్ని చేపల మాఫియా అడ్డుకుంటుండటం గమనార్హం. 


మత్స్య సంపదను దోచుకుంటున్నారు 

మంచాలకట్ట, మల్లేశ్వరం, అమరగిరి కృష్ణానదిలో ఆంరఽధా జాలర్లు మత్స్య సంపద దోచుకుంటున్నారు. అలివి వలల ద్వారా చిన్న చేపలు పట్టి ఎండబెట్టి ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు. ఇక్కడ కొంతమంది దళారులతో కుమ్మక్కై చిన్న చేపలను పట్టిస్తున్నారు. అధికారులు చొరవ చూపి చర్యలు తీసుకోవాలి. 

- మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు గోవిందు


అధికారులు పట్టించుకోరు 

గతంలో ఎన్నో సార్లు మత్స్య శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. ఒకవేళ స్పందించినా నామమాత్రపు దాడులు నిర్వహించి తిరిగి వెళ్తారు. ప్రతీ సంవత్సరం కోట్ల రూపాయలు ఖర్చు చేసి నదుల్లో చేపలు వదులుతారు. కానీ, వదిలిన రెండు నెలలకే అలివి వలల ద్వారా చేపలు పడతారు. అధికారులు చొరవ చూపి అలివి వలలను నిషేధించాలి. 

- రఘు, మత్స్యకారుడు



Updated Date - 2022-01-18T04:35:54+05:30 IST