ఏప్రిల్ నుంచి Paracetamolతో సహా 800 అత్యవసర ఔషధాల ధరలు పెంపు

Published: Sat, 26 Mar 2022 07:05:44 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏప్రిల్ నుంచి Paracetamolతో సహా 800 అత్యవసర ఔషధాల ధరలు పెంపు

న్యూఢిల్లీ: దేశంలో రోగులపై మరింత భారం పడనుంది.పారాసెటమాల్‌తో సహా 800 అత్యవసరమైన మందుల ధరలు ఏప్రిల్ నుంచి 10.7శాతం పెరగనున్నాయి. 2021 క్యాలండరు సంవత్సరానికి గాను మందుల టోకు ధరల సూచికను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. మెజారిటీ సాధారణ జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగించే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌లో దాదాపు 800 షెడ్యూల్ చేసిన మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయి.వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు కార్యాలయం అందించిన డేటా ఆధారంగా మందుల ధరలు పెంచినట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటీసులో పేర్కొంది.


ఈ నిర్ణయంతో జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, రక్తహీనత వంటి వాటికి వాడే మందుల ధరలు పెరగనున్నాయి. ఇందులో పారాసెటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడాజోల్ వంటి మందుల ధరలు పెరగనున్నాయి. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.