హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అనేది చాలా పెద్ద కార్యక్రమం. పూజలు, ఆచారాలు, సాంప్రదాయాలు.. అంటూ చాలా పెద్ద తంతు ఉంటుంది. రాత్రి పూట మొదలయ్యే పెళ్లిళ్లు తెల్లవారు జాము వరకు సాగుతూనే ఉంటాయి. సుదీర్ఘంగా సాగే ఆ పెళ్లి తంతు చాలా మంది సహనాన్ని పరీక్షిస్తుంటుంది. తాజాగా వైరల్ అయిన ఓ వీడియోలో పెళ్లి జరిపించే పంతులు గారు కూడా తొందరపడ్డారు.
ఆ వీడియో ప్రకారం.. అప్పటికే తెల్లవారుఝాము 3 గంటలు అవుతోంది. ఇంకా పెళ్లి తంతు ముగియలేదు. పంతులు గారు ఇంటికి వెళ్లిపోవాలని తొందరపడుతున్నారు. అందుకే, హోమ గుండం చుట్టూ నెమ్మదిగా ప్రదక్షణలు చేస్తున్న వధూవరులను ఆ పంతులు గారు.. `నడవడం కాదు.. పరిగెత్తండి.. పరిగెత్తండి` అంటూ తొందరపెట్టారు. పంతులుగారి కామెంట్స్ విని వధూవరులతో సహా బంధువులందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతి కొద్ది సమయంలోనే 20వేల వ్యూస్, 900 లైకులు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి