83 ఏళ్ల వయసులో పోర్న్‌ స్టార్‌గా మారిన మతప్రచారకుడు! 30 ఏళ్లపాటు కాపురం చేశాక హఠాత్తుగా...

Published: Fri, 27 May 2022 20:04:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
83 ఏళ్ల వయసులో పోర్న్‌ స్టార్‌గా మారిన మతప్రచారకుడు! 30 ఏళ్లపాటు కాపురం చేశాక హఠాత్తుగా...

ఎన్నారై డెస్క్: కొందరి జీవితాల్లో ఒక్కోసారి అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. లైఫ్‌లో అలాంటి అసాధారణ మలుపును చూసిన ఓ వ్యక్తి గురించి మనం ప్రస్తుతం చెప్పుకోబోతున్నాం. అమెరికాకు చెందిన ఓ మత ప్రచారకుడు 83 ఏళ్ల వయసులో పోర్న్ స్టార్‌గా మారారు. ఈ అనుభవం అద్భుతమని, ఇదే బెస్ట్ అని ప్రస్తుతం మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అసలు ఆయన ఎవరు..? ఇంతటి ముదిమి వయసులో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు.

ఇది ఐదేళ్ల నాటి మాట.. అప్పటికి నార్మ్ వయసు 83 ఏళ్లు. జీవితంలో అధికభాగం మత ప్రచారకుడిగా గడిపిన ఆయన అకస్మాత్తుగా పోర్న్ స్టార్‌గా మారేందుకు నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే.. 2017లో మత ప్రచారకుడి బాధ్యతలను వదిలేసి పోర్న్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అప్పుడే ఆయన తొలి మూవీ విడుదల అయ్యింది. అప్పటికే నార్మ్ వివాహితుడు. కానీ.. 30 ఏళ్ల పాటు కుటుంబ జీవితం గడిపాక.. నార్మ్‌కు తాను గే అన్న విషయం స్ఫురించింది. ఆ తరువాత.. మరో ఇరవై ఏళ్లు గడిచాక, అంటే.. 83 ఏళ్ల వయసులో తన లైంగికాసక్తి గురించి ప్రపంచానికి తెలియజేశారు. ప్రస్తుతం ఈ లైఫ్‌ ఆనందంగా ఉందని, అన్ని సంకెళ్లు తెగిపోయాయనిపించే స్థాయిలో స్వేచ్ఛను అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చారు నార్మ్. 

మత ప్రచారకుడి నుంచి పోర్న్ స్టార్‌గా.. ఎందుకిలా..? అని విలేకరులు ఆయనను ప్రశ్నించగా.. శృంగారమే మనుషులను భగవంతుడికి దగ్గర చేస్తుందంటూ తనదైన ఫిలాసఫీని ముందుపెట్టారు. ‘‘నా శరీరం ఓ మందిరం. ఇందులో శృంగారం, అనిర్వచనీయమైన పారవశ్యం ఉంటాయి’’ అంటూ వివరించారు. అంతేకాదు.. మానవ సమాజంలో శృంగారం పట్ల ఓ చిన్నచూపు ఉందని కూడా చెప్పిన ఆయన.. ఈ భావనలు దూరమయ్యే వరకూ ఇలా పోర్న్ చిత్రాలలో నటిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ‘‘మనలో ఎవరైనా శృంగారాన్ని ఆస్వాదించాల్సిందే. అటువంటప్పుడు..  మరింత స్వేచ్ఛను పొందేలా, ఇతరులకు మానసికంగా మరింత దగ్గర అయ్యేలా శృంగారాన్ని ఎందుకు ఆస్వాదించకూడదు’’ అని నార్మ్ ప్రశ్నిస్తారు. అన్నట్టు.. ఇలాంటి చిత్రాల్లో నటించినందుకు నార్మ్ పైసా కూడా పారితోషికం తీసుకోరట. ‘‘స్వేచ్ఛాయుత జీవితాన్ని చవిచూసిన తనలాంటి వారికి ఈ అనుభవం గురించి ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది’’ అని చెప్పారు. ఇక ‘పోర్న్’ అనే పదమే తనకు గిట్టదని నార్మ్ చెప్పారు. నిబంధనలకు అనుగూణంగా లేని ప్రతిదానికి సమాజం పోర్న్ అని పేరుపెడుతుందంటూ తన విముఖతకు గల కారణాలను వివరించారు. 


TAGS: NRI Priest
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

అమెరికా నగరాల్లోLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.