ఎగుమతులు @ 30 లక్షల కోట్లు!

Published: Mon, 28 Mar 2022 03:36:08 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎగుమతులు @ 30 లక్షల కోట్లు!

ఏపీ నుంచి కొరియాకు బంగినపల్లి 

మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ వెల్లడి


న్యూఢిల్లీ, మార్చి 27: భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రూ. 30 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. భారతీయులంతా స్థానిక ఉత్పత్తుల కోసం డిమాండ్‌ చేస్తే అవి అంతర్జాతీయం అయ్యేందుకు ఎంతో సమయం పట్టదని తెలిపారు. ప్రధాని మోదీ ఆదివారం మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. గడిచిన ఏడాది కాలంలో ‘గవర్నమెంట్‌ ఈ మార్కెట్‌ ప్లేస్‌(జీఈఎం) ద్వారా ప్రభుత్వం 1.25 లక్షల చిన్న వ్యాపారులు, దుకాణదారుల నుంచి రూ.లక్ష కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసినట్లు చెప్పారు. చిన్నచిన్న వ్యాపారులే నేరుగా ప్రభుత్వానికి అమ్మకాలు జరిపారన్నారు. దేశంలో ఆయుష్‌ ఉత్పత్తుల మార్కెట్‌, దానికి సంబంధించిన స్టార్ట్‌పలు పెరగడం సంతోషకరమని ప్రధాని చెప్పారు. ఆరేళ్ల కిందట రూ.22 వేల కోట్లుగా ఉన్న ఆయుష్‌ మార్కెట్‌ ప్రస్తుతం రూ.1.40 లక్షల కోట్లకు చేరిందన్నారు. నాణ్యమైన ఉత్పత్తులతో ఆయుష్‌ స్టార్ట్‌పలు ప్రపంచాన్ని ఏలుతాయని, ఆ రోజు త్వరలోనే రానుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు.


రైతులు, కళాకారులు, నేతన్న లు, ఇంజనీర్లు, చిన్న వ్యాపారులు, ఎంఎ్‌సఎం ఈ రంగం, వివిధ వృత్తులకు సంబంధించిన నిపుణులే దేశానికి బలమని చెప్పారు. దేశం నుంచి కొత్త ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయన్నారు. ఏపీలోని కృష్ణాజిల్లా నుం చి బంగినపల్లి మామిడిపళ్లు, చిత్తూరు జిల్లా నుంచి సువర్ణరేఖ మామిడిపళ్లు దక్షిణ కొరియా కు ఎగుమతయ్యాయని ప్రధాని గుర్తుచేశారు. 


బన్సీలాల్‌పేట్‌ మెట్లబావి పునరుద్ధరణ భేష్‌

ప్రతి నీటి బొట్టునూ సంరక్షించాలని ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. అలాగే నీటి రీసైక్లింగ్‌ కోసం పనిచేయాలని సూచించారు. చెక్‌డ్యాంల నిర్మాణం, వాన నీటి సంరక్షణ, వ్యక్తిగత ప్రయత్నాలు.. ఇలా అన్ని రకాలుగా జల సంరక్షణకు పాటుపడాలని కోరారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రతి జిల్లాలో కనీసం 75 ‘అమృత్‌ సరోవర్‌’లను ఏర్పాటు చేయాలన్నారు. కొన్ని పాత చెరువులను  పునరుద్ధరించాలని, కొత్త వాటిని కూడా తవ్వాలని చెప్పారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో ఉన్న పురాతన మెట్లబావిని పునరుద్ధరించడాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రశంసించారు. ‘‘అనేక సంవత్సరాలుగా మెట్లబావి నిర్లక్ష్యానికి గురైంది. అది మట్టి, చెత్తతో నిండిపోయింది. కానీ, ఇప్పుడు ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో పునరుద్ధరణ చేయాలన్న ప్రచారం మొదలైంది’’ అని వ్యాఖ్యానించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.