Jantar Mantar: ప్రధాని మోదీ సోదరుడి ధర్నా

ABN , First Publish Date - 2022-08-02T21:46:36+05:30 IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సోదరుడు ప్రహ్లాద్ మోదీ (Prahlad Modi) ఢిల్లీ జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ధర్నాకు

Jantar Mantar: ప్రధాని మోదీ సోదరుడి ధర్నా

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సోదరుడు ప్రహ్లాద్ మోదీ (Prahlad Modi) ఢిల్లీ జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద ధర్నాకు దిగారు. అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం (All India Fair Price Shop Dealers Federation) ఉపాధ్యక్షుడైన ప్రహ్లాద్ మోడీ తమ సంఘం డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ధర్నా చేపట్టారు. జీవన వ్యయం పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో రేషన్ దుకాణాలు నడపడం కష్టంగా మారిందని ఆయన వాపోయారు. రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే బియ్యం, గోధుమలు, పంచదారపై కేంద్ర ప్రభుత్వం తమకిచ్చే కమిషన్‌లో కేజీకి 20 పైసలు మాత్రమే పెంచడం క్రూరమైన హాస్యమని ప్రహ్లాద్ మోదీ విమర్శించారు. రేషన్ డీలర్లను ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కించడానికి కేంద్రం సాయం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం తమ డీలర్ల సంఘం నాయకులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. బుధవారం తాము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వినతి పత్రం అందజేస్తామన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తామన్నారు. 


పశ్చిమబెంగాల్ తరహాలో దారిద్ర్యరేఖకు ఎగువన ఉన్న వారికి రేషన్ షాపుల్లో సబ్సిడీ ధరల్లో బియ్యం, గోధుమలు, పంచదార,  అమ్మేందుకు అనుమతినివ్వాలని అఖిల భారత చౌక ధరల దుకాణాల డీలర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాదు గ్యాస్ సిలెండర్లు, పప్పు దినుసులు, వంటనూనెలు కూడా రేషన్ షాపుల ద్వారా అమ్మేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంఘం నేతలు కోరుతున్నారు. 

Updated Date - 2022-08-02T21:46:36+05:30 IST