ఏకాగ్రతతో ఆన్‌లైన్‌లోనూ బాగా చదవచ్చు

Published: Sat, 02 Apr 2022 08:11:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏకాగ్రతతో ఆన్‌లైన్‌లోనూ బాగా చదవచ్చు

                   - హోసూరు టీచర్‌కు మోదీ సమాధానం


చెన్నై: పాఠాలపై ఆసక్తి, ఉపాధ్యాయుల బోధనపై ఏకాగ్రతను కలిగి వుంటే విద్యార్థులు ఆన్‌లైన్‌లోనూ బాగా చదవగలుగుతారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పోటీపరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో ఆయన ప్రతియేటా ‘పరీక్షా పే చర్చా’ పేరుతో చర్చాగోష్ఠిలో పాల్గొంటున్నారు. ఆ మేరకు శుక్రవారం ఢిల్లీ నుండి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఆ సందర్భంగా హోసూరుకు చెందిన ఉపాధ్యాయుడు చంద్రచూడేశ్వరన్‌ అడిగిన ప్రశ్నకు మోదీ బదులిస్తూ .. విద్యార్థులు పరీక్షలంటే భయపడకూడదని, సాధించగలమనే ఆత్మవిశ్వాసంతో పరీక్షలను సమర్థవంతంగా రాయాలన్నారు. ఆన్‌లైన్‌ పాఠాల ద్వారా విద్యార్థులు ఎలా చదవగలగుతారని హోసూరు ఉపాధ్యాయుడు అడిగినప్పుడు.. తరగతి గదిలోను, ఆన్‌లైన్‌లో పాఠాలను చక్కగా అర్థం చేసుకోవాలంటే విద్యార్థులకు ఏకాగ్రత ఉండాలన్నారు. ఏకాగ్రత లేకుండా పాఠాలపై దృష్టిసారించకపోతే నేర్చుకోలేరని అన్నారు. ఇదిలా ఉండగా మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి కార్పొరేషన్‌ పాఠశాలలు, సర్వోదయ పాఠశాల, తక్కర్‌బాబా పాఠశాల విద్యార్థులతో కలిసి తిలకించారు. 200 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో గవర్నర్‌తోపాటు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

జాతీయంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.