బేగంపేట్ నుంచి విజయవాడకు ప్రధాని Modi పయనం

ABN , First Publish Date - 2022-07-04T15:05:37+05:30 IST

తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది.

బేగంపేట్ నుంచి విజయవాడకు ప్రధాని Modi పయనం

హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) పర్యటన ముగిసింది. కాసేపటి క్రితమే రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు(Begumpet airport)కు బయలుదేరి వెళ్లారు. బేగంపేట నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు మోదీ వెళ్లనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో మోదీకి గవర్నర్ తమిళిసై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీడ్కోలు పలికారు.  ఈనెల 2న నోవటేల్‌లో జరిగే బీజేపీ (BJP) జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ప్రధాన మంత్రి హైదరాబాద్‌కు వచ్చారు. రెండు రోజుల పర్యటన అనంతరం ఈరోజు ఏపీ (AP)కి బయలుదేరి వెళ్లారు. ఏపీలోని భీమవరంలో జరిగే అల్లూరి సీతారామారాజు (Alluri setarama raju) 125వ జయంతి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. ప్రధాని సభతో రాష్ట్ర కమలనాథుల్లో నూతన ఉత్తేజం నెలకొంది. ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది.  


భద్రత కట్టుదిట్టం...

మరోవైపు ఏపీలో మోదీ పర్యటన నేపథ్యంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (Vijayawada international airport) పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. తెల్లవారుజాము 6 గంటల నుంచి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. బోర్డింగ్, వాహన, సిబ్బంది పాస్ ఉన్న వారినే విమానాశ్రయంలోకి అనుమతి ఇస్తున్నారు. పీఎం ఎస్పీజీ (SPG) భద్రతలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ప్రధాని పర్యటన దృష్ట్యా విమానాశ్రయం పరిసరాల్లో ఆంక్షలు విధించారు. విమానాశ్రయం వద్ద భారీగా  భద్రతా బలగాలు మోహరించారు. 

Updated Date - 2022-07-04T15:05:37+05:30 IST