బాసరలో ‘ప్రధాని జన్మదిన’ పూజలు

ABN , First Publish Date - 2021-09-18T07:12:06+05:30 IST

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు.

బాసరలో ‘ప్రధాని జన్మదిన’ పూజలు

బాసర, సెప్టెంబరు, 17: బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. అక్షర శిఖరం మండపంలో ప్రధానమంత్రి పేరిట కుంకుమార్చన, హారతి పూజలను జరిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నిర్మల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్నాల సాయినాథ్‌ కిషన్‌ మోర్చా జిల్లా కోశాధికారి బల్గూరి నర్సింగ్‌ రావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T07:12:06+05:30 IST