నాన్న నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు: ప్రిన్స్ హ్యారీ

ABN , First Publish Date - 2021-03-09T01:17:49+05:30 IST

బ్రిటిష్ రాజవంశ సంక్షోభం నానాటికీ తీవ్రమవుతోంది. ప్రిన్స్ హ్యారీకి, బ్రిటిష్ రాజకుటుంబానికి మధ్య వివాదం రచ్చకెక్కుతోంది. రాజకుటుంబంతో తెగదెంపులు చేసుకున్న తరువాత తొలిసారిగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మేగన్ మోర్కెల్, ప్రిన్స్ హ్యారీలు..

నాన్న నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు: ప్రిన్స్ హ్యారీ

లండన్: బ్రిటిష్ రాజవంశ సంక్షోభం నానాటికీ తీవ్రమవుతోంది. ప్రిన్స్ హ్యారీకి, బ్రిటిష్ రాజకుటుంబానికి మధ్య వివాదం రచ్చకెక్కుతోంది. రాజకుటుంబంతో తెగదెంపులు చేసుకున్న తరువాత తొలిసారిగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మేగన్ మోర్కెల్, ప్రిన్స్ హ్యారీలు తమ కుటుంబంలోని అనేక వివాదాస్పద విషయాలను పంచుకున్నారు. అమెరికాలోని పాపులర్ టీవీ షో ఓఫ్రా విన్ఫ్రే కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రిన్స్ హ్యారీ మాట్లాడుతూ.. తాను ఫోన్ చేస్తూ తన తండ్రి కాల్ లిఫ్ట్ కూడా చేయడం లేదని, ఆర్థికంగా ఎలాంటి ప్రయోజరాలు చెందకుండా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘అంతకుముందు నానమ్మతో మూడు సార్లు మాత్రమే మాట్లాడాను. నాన్నతో రెండు సార్లు. ఆ తరువాత నాన్న నా ఫోన్ లిఫ్ట్ చేయడమే మానేశార’ని ప్రిన్స్ హ్యారీ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఇన్ని సార్లు ఫోన్ చేసేకంటే మొత్తం ఓ లెటర్‌లో రాసి పంపించమన్నారని, ఆయన కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారని, అయనంటే తనకు చాలా ఇష్టమని, కానీ ఇప్పటికే తన మనసు చాలా గాయపడిందని ప్రిన్స్ హ్యారీ చెప్పాడు. 

Updated Date - 2021-03-09T01:17:49+05:30 IST