Queen's funeral : క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యారీకి యూనిఫాం చిక్కులు

ABN , First Publish Date - 2022-09-14T22:20:01+05:30 IST

క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో మిలిటరీ యూనిఫాం ధరించకూడదని

Queen's funeral : క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యారీకి యూనిఫాం చిక్కులు

లండన్ : క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో మిలిటరీ యూనిఫాం ధరించకూడదని ప్రిన్స్ హ్యారీపై రాజ వంశం నిషేధం విధించింది. దీనిపై ఆయన స్పందిస్తూ తాను సంతాప దుస్తులు ధరిస్తానని, తన దృష్టి మొత్తం క్వీన్ జీవితం, ఔన్నత్యంపైనే ఉంటాయని తెలిపారు. ఓ దశాబ్దంపాటు తాను చేసిన మిలిటరీ సేవలను యూనిఫాం నిర్ణయించదన్నారు. 


బ్రిటిష్ రాజ కుటుంబం ప్రకటనను ఉటంకిస్తూ ఆ దేశ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం,  క్వీన్ ఎలిజబెత్-2 మరణానికి సంతాపం, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు సంబంధించిన ఐదు ప్రధాన కార్యక్రమాల్లో నూతన, వర్కింగ్ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మిలిటరీ యూనిఫాం ధరిస్తారని తెలిపారు. క్వీన్ ఫైనల్ విజిల్ సమయంలో గౌరవ సూచకంగా మినహా ప్రిన్స్ ఆండ్రూ మిలిటరీ యూనిఫాం ధరించరని తెలిపింది. అంటే ప్రిన్స్ హ్యారీ వర్కింగ్ రాయల్ మెంబర్ కాదు కాబట్టి ఆయన మిలిటరీ యూనిఫాం ధరించడానికి వీల్లేదన్నమాట.


దీనిపై ప్రిన్స్ హ్యారీ అధికార ప్రతినిధి ఆష్లీ హన్సెన్ స్పందిస్తూ, ప్రిన్స్ హ్యారీ, డ్యూక్ ఆఫ్ ససెక్స్, తన గ్రాండ్‌మదర్‌ను గౌరవించే అన్ని కార్యక్రమాల్లోనూ సంతాప దుస్తులు ధరిస్తారని తెలిపారు. ఆయన ఓ దశాబ్దం పాటు మిలిటరీలో చేసిన సేవలను ఆయన ధరించే యూనిఫాం నిర్ణయించదన్నారు. క్వీన్ ఎలిజబెత్-2 జీవితం, ఔన్నత్యంపై దృష్టి సారించాలని గౌరవపూర్వకంగా కోరుతున్నట్లు తెలిపారు. 


ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ రాయల్ ఫ్యామిలీ సీనియర్ మెంబర్‌షిప్‌ను 2020లో వదులుకున్నారు. 


Updated Date - 2022-09-14T22:20:01+05:30 IST