కాలేజీకి బయలుదేరిన ప్రిన్సిపాల్‌‌కి ఆ ముగ్గురు గుర్తుకొచ్చారు.. వెంటనే నైలాన్ తాడు కొని.. నేరుగా క్యాంపస్‌లోని పాత భవనంలోకి వెళ్లారు.. తరువాత జరిగిన ఘోరమిదే!

ABN , First Publish Date - 2021-10-29T16:08:58+05:30 IST

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో ఘోరం చోటుచేసుకుంది.

కాలేజీకి బయలుదేరిన ప్రిన్సిపాల్‌‌కి ఆ ముగ్గురు  గుర్తుకొచ్చారు.. వెంటనే నైలాన్ తాడు కొని.. నేరుగా క్యాంపస్‌లోని పాత భవనంలోకి వెళ్లారు.. తరువాత జరిగిన ఘోరమిదే!

ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో ఘోరం చోటుచేసుకుంది. నాగరిక్ కల్యాణ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ భువనేశ్వర్ నాయక్ మృతి వెనుక చిక్కుముడి వీడింది. ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో అసలు విషయం వెలుగు చూడటంతో పాటు ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తేలింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో ప్రిన్సిపాల్ భువనేశ్వర్ నాయక్ తన ఆత్మహత్యకు కాలేజీలోని ముగ్గురు సిబ్బంది కారణమని పేర్కొన్నారు. 


ఈ కేసు గురించి అడిషినల్ ఎస్పీ అనంత కుమార్ మాట్లాడుతూ కేసు దర్యాప్తులో తమకు సూసైడ్ నోట్ లభ్యమయ్యిందని, దానిలో ముగ్గురి ఇంటి పేర్లు ఉన్నాయని, వారు ఎవరనేది తెలియాల్సివుందన్నారు. అయితే వారు కాలేజీ స్టాఫ్ అని నిర్థారణ అయ్యిందన్నారు. మృతుని కుటుంబ సభ్యులు కూడా కాలేజీ స్టాఫ్‌పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాగా ఆ ముగ్గురు సిబ్బంది కాలేజీలో అక్రమాలకు పాల్పడేవారని, వీరికి ప్రిన్సిపాల్ భువనేశ్వర్ నాయక్ సహకరించేవారు కాదని తెలుస్తోంది. ఫలితంగా వారు భువనేశ్వర్ నాయక్‌ను వేధింపులకు గురి చేసేవారనే ఆరోపణలున్నాయి. ప్రతిపనిలో ప్రిన్సిపాల్‌కు అడ్డుతగిలేవారిని తెలుస్తోంది. దీంతో భువనేశ్వర్ నాయక్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. హేమచంద్ యాదవ్ విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్ డాక్టర్ అరుణా పల్టా మాట్లాడుతూ డాక్టర్ నాయక్ కాలేజీలో సరిగా పనిచేసేవారు కాదని, అతని మానసిక స్థితి సరిగా ఉండేది కాదన్నారు.


 ఫలితంగా కాలేజీలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. కాగా నాయక్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో పెద్ద కుమార్తెకు వివాహమయ్యింది. రెండవ కుమార్తె తండ్రి పనిచేస్తున్న కాలేజీలోనే చదువుకుంటోంది. కాగా ఈ ఘటన జరిగిన రోజు ప్రిన్సిపాల్ డాక్టర్ నాయక్ ఉదయం 8 గంటలకు ఇంట్లోనివారికి కాలేజీకి వెళుతున్నానని చెప్పారు. అయితే దారిలో ఎరుపు రంగు నైలాన్ తాడు కొనుగోలు చేసి, బైక్‌పై కాలేజీలో నిర్మానుష్యంగా ఉండే పాత భవనంలోనికి చేరుకున్నారు. అక్కడ ఫ్యాన్ హుక్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Updated Date - 2021-10-29T16:08:58+05:30 IST