గుణాత్మక విద్య బాధ్యత ప్రధానోపాధ్యాయులదే

ABN , First Publish Date - 2022-08-07T06:27:28+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందని కలెక్టర్‌ దిల్లీరావు సూచించారు.

గుణాత్మక విద్య బాధ్యత ప్రధానోపాధ్యాయులదే
జంగాల కాలనీలో సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ దిల్లీరావు, ఎమ్మెల్యే జగన్‌మోహనరావు

కలెక్టర్‌ దిల్లీరావు

నందిగామ, ఆగస్టు 6: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందని కలెక్టర్‌ దిల్లీరావు సూచించారు. జిల్లా పరిషత్‌ పాఠశాలలో శనివారం నూతన విద్యావిధానంపై హెచ్‌ఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాఠశాలల విలీనం వల్ల ఎవరికీ ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని కలెక్టర్‌ అన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తున్నందున  ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేసి మంచి ఫలితాలు సాధించాలన్నారు. నాడు-నేడు ఫేజ్‌-2 పనులు కూడా వేగంగా నిర్వహిం చాలని ఆదేశించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో  పాఠశాలల అభివృద్ధి జరిగిందన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యావ్యాప్తికి కృషి చేయాలన్నారు.  నియోకవర్గంలోని హెచ్‌ఎంలు పాల్గొన్నారు. 


కలెక్టర్‌ దృష్టికి జంగాల కాలనీ సమస్యలు

కంచికచర్ల రూరల్‌ : కంచికచర్ల జంగాల కాలనీలోని ఖాళీ స్థలాల్లో డేరాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న జంగాల కుటుంబాల స్థితిగతులను కలెక్టర్‌ దిల్లీరావుతో పాటు ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్‌మోహనరావు శనివారం పరిశీలించారు. ప్రభుత్వం తరపున జంగాల కుటుంబాలకు సహకారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కోరారు. కాలనీలో మరికొందరు ఇళ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకున్నారని, అర్హులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజకుమారి, ఎంపీడీవో శిల్ప, హౌసింగ్‌ ఏఈ నరసింహారావు, కార్యదర్శి కనగాల రవికుమార్‌, సర్పంచ్‌ సునీత, ఆర్‌ఐ శిరీష పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-07T06:27:28+05:30 IST