ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత

ABN , First Publish Date - 2021-06-21T07:27:46+05:30 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆలయాల అభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యతనిచ్చినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లాకేం ద్రంలోని బంగల్‌పేట్‌లో గల నల్ల పోచమ్మ

ఆలయాల అభివృద్ధికి ప్రాధాన్యత
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి అల్లోల

బంగల్‌పేట్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రత్యేక పూజలు

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 20: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆలయాల అభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యతనిచ్చినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లాకేం ద్రంలోని బంగల్‌పేట్‌లో గల నల్ల పోచమ్మ ఆలయంలో  విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కౌన్సిలర్‌ నవీన్‌, తదితరులు పాల్గొన్నారు. 

సంగీత పరికరాల పంపిణీ

నిర్మల్‌లో ఆదివారం స్థానిక పెన్షనర్ల సంఘ భవనంలో పలువురు జానపద కళాకారులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సంగీత వాయిధ్య పరికరాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు పాల్గొని సంగీత వాయిధ్య పరికరాలను అందుకున్నారు. ఇందులో జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి, రజిత పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T07:27:46+05:30 IST