Prisoner: ఆస్పత్రి బాత్రూమ్ నుంచి తప్పించుకున్న ఖైదీ.. పోలీసులు ఏం చేశారంటే..

ABN , First Publish Date - 2022-09-06T02:01:03+05:30 IST

అతడు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ.. కడుపునొప్పి అని చెబితే పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

Prisoner: ఆస్పత్రి బాత్రూమ్ నుంచి తప్పించుకున్న ఖైదీ.. పోలీసులు ఏం చేశారంటే..

అతడు జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ.. కడుపునొప్పి అని చెబితే పోలీసులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు.. అక్కడ బాత్రూమ్‌కు అని చెప్పి వెళ్ళాడు.. బాత్‌రూమ్‌ కిటికీ పగలగొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు.. షాకైన పోలీసులు అతడిని పట్టుకునేందుకు మూడు బృందాలను రంగంలోకి దించారు.. పోలీసులందరూ కలిసి అతడిని 24 గంటల్లోనే పట్టుకుని జైలుకు తరలించారు.. హర్యానా (Haryana)లోని అంబాలాలో ఈ ఘటన జరిగింది. 


ఇది కూడా చదవండి..

Shocking: ఇద్దరు పిల్లల తండ్రితో ప్రేమలో పడిన మైనర్ బాలిక.. వారిద్దరూ కలిసి ఏం చేశారంటే..


బల్దేవ్ నగర్ నివాసి అయిన ప్రిన్స్ అంబాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కడుపునొప్పి కారణంగా గత శుక్రవారం అంబాలా నగరంలోని సివిల్ ఆసుపత్రిలోని ఖైదీ వార్డులో చేరాడు. అతడికి కాపలాగా ఇద్దరు పోలీసులు ఉన్నారు. ఆదివారం ఉదయం బాత్‌రూమ్‌కి వెళ్లాలని పోలీసులకు ప్రిన్స్ చెప్పాడు. వారు ప్రిన్స్‌ను బాత్రూమ్‌కు తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన ప్రిన్స్ బాత్రూమ్‌ కిటికీ పగలగొట్టి బయటకు దూకి పరారయ్యాడు. ప్రిన్స్ తప్పించుకున్నట్టు తెలుసుకున్న పోలీసులు షాకయ్యారు. వెంటనే అతడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. వారు అంబాలా మొత్తాన్ని జల్లెడ పట్టి 24 గంటల లోపే ప్రిన్స్‌ను పట్టుకున్నారు. 

Updated Date - 2022-09-06T02:01:03+05:30 IST