ఆగ్రా సెంట్రల్ జైలులో 12 మంది prisoners బోర్డు పరీక్షలు పాస్

ABN , First Publish Date - 2022-06-20T18:31:57+05:30 IST

సెంట్రల్ జైలులోని 12 మంది ఖైదీలు బోర్డు పరీక్షలు పాస్ అయిన ఘటన...

ఆగ్రా సెంట్రల్ జైలులో 12 మంది prisoners బోర్డు పరీక్షలు పాస్

ఆగ్రా (యూపీ): సెంట్రల్ జైలులోని 12 మంది ఖైదీలు బోర్డు పరీక్షలు పాస్ అయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సెంట్రల్ జైలులో వెలుగుచూసింది.ఆగ్రా సెంట్రల్ జైలులో ఉన్న 12 మంది ఖైదీలు వార్షిక 10వ తరగతి, 12వ తరగతి యూపీ బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని జైలు అధికారులు తెలిపారు.‘‘10వ తరగతిలో ముగ్గురు ఖైదీలు ఫస్ట్ డివిజన్ ర్యాంక్ సాధించారు,మరో ఆరుగురు ఖైదీలు సెకండ్ డివిజన్ ర్యాంక్ పొందారు. అంతేకాకుండా 12వ తరగతిలో ముగ్గురు ఖైదీలకు సెకండ్ డివిజన్ వచ్చింది అని జైలు సీనియర్ సూపరింటెండెంట్ వికె సింగ్ చెప్పారు. 10వ తరగతిలో జితేంద్ర అనే ఖైదీ 64.83 శాతం మార్కులు సాధించగా, అర్జున్‌, షీలేష్‌లు వరుసగా 63.16, 62.83 శాతం మార్కులు సాధించారు.


 ‘‘ఇది మాకు,ఖైదీలకు సంతోషకరమైన క్షణం, వారి దృఢ సంకల్పంతో వారు కటకటాల వెనుక పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇది ఇతర ఖైదీలను కూడా ప్రేరేపిస్తుంది. ఖైదీలు జైలు నుంచి విడుదల అయినప్పుడు వారు లక్ష్యాన్ని సాధిస్తారు’’ అని అధికారి చెప్పారు. జైలులో ఖైదీలు చదువుకోవడానికి లైబ్రరీ ఉంది. ఆగ్రా జైలులో మరికొందరు ఖైదీలు కూడా ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్‌లోని వివిధ కోర్సులలో చేరారు. 


Updated Date - 2022-06-20T18:31:57+05:30 IST