పరువు పోతుందని..కూతురిని చంపుకొని..

ABN , First Publish Date - 2022-05-28T07:49:25+05:30 IST

ఆ తల్లిదండ్రులకు కన్నపేగు కన్నా పరువే ఎక్కువైం ది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కన్నా తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందనే

పరువు పోతుందని..కూతురిని చంపుకొని..

నిద్రిస్తుండగా కత్తితో గొంతుకోసిన తల్లిదండ్రులు

వేరే మతస్తుడిని పెళ్లి చేసుకుందనే..

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోరం..

నార్నూర్‌, మే 27: ఆ తల్లిదండ్రులకు కన్నపేగు కన్నా పరువే ఎక్కువైం ది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కన్నా తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందనే ఆందోళనే ఎక్కువైంది. ఇతర మతస్తుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ద్వారా తమ పరువు తీసిందని భావించిన ఆ తల్లిదండ్రులు, తమ కూతురిని దారుణంగా గొంతు కోసి చంపేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో శుక్రవారం ఈ దారుణం జరిగింది. నార్నూర్‌ మండలం నాగల్‌కొండ గ్రామానికి చెందిన పవార్‌ సావిత్రి బాయి, దేవిదాస్‌ దంపతులు వ్యవసాయం, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఇద్ద రు కుమారులు. వీరిలో రాజేశ్వరి (20) చిన్న కూతురు. ఆమె వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. తల్లిదండ్రులకు తెలియకుండా రెండు నెలల క్రితం అదే యువకుడిని పెళ్లి చేసుకుంది. అనంతరం మహారాష్ట్రలోని బంధువుల ఇంటికి వె ళ్లిపోయింది. ఇవేమీ తెలియని రాజేశ్వరి తల్లిదండ్రులు.. తమ కూతురు కనిపించకపోవడంతో ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. మ హారాష్ట్రలో ఉంటున్న రాజేశ్వరిని, ఆ యువకుడిని ఇటీవలే గ్రామానికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. యువతి తండ్రి దేవిదాస్‌ ఫిర్యాదు మేరకు యువకుడిపై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటినుంచి రాజేశ్వరి, తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. పోలీసుల వద్ద నోరు మెదపని రాజేశ్వరి.. తన ప్రేమ, పెళ్లి విషయాన్ని వారం క్రితం తల్లిదండ్రులకు చెప్పింది. ఆ యువకుడిని తాను పెళ్లి చేసుకున్నానని, అతడితోనే ఉంటానని తేల్చి చెప్పింది. ఇందుకు తల్లిదండ్రు లు ససేమిరా అన్నారు. కానీ రాజేశ్వరి వినకుండా తల్లిదండ్రులతో నిత్యం గొడవ పడుతోంది. ఈ విషయమై గురువారం కూడా తల్లిదండ్రులతో రాజేశ్వరి తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగింది. యువకుడి వద్దకు తనను పంపించకుంటే జరిగిన విషయాన్ని పోలీసులకు చెబుతామని బెదిరించింది. ఇలాగైతే తమ పరువుపోతుందని భావించిన తల్లిదండ్రులు శుక్రవారం తెల్లవారు జామున రాజేశ్వరి గాఢనిద్రలో ఉండగా కత్తితో గొంతు హత్యచేశారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న సీఐ ప్రేమ్‌కుమార్‌, ఎస్సై రవికిరణ్‌ శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.  నిందితులు పవార్‌ సావిత్రిబాయి, దేవిదా్‌సను అదుపులోకి తీసుకున్నారు. 


Updated Date - 2022-05-28T07:49:25+05:30 IST