Prithviraj Sukumaran: ప్రభాస్‌ సినిమా చేయనన్నాను.. కారణం ఏంటంటే!

Published: Sat, 25 Jun 2022 22:30:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Prithviraj Sukumaran: ప్రభాస్‌ సినిమా చేయనన్నాను.. కారణం ఏంటంటే!

‘‘తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తాననేది త్వరలో చెబుతా. తెలుగు సినిమాలు చేయాలని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇతర చిత్రాల డేట్స్‌ విషయంలో కసరత్తు జరుగుతోంది. ‘సలార్‌’ చిత్రం ఓ కీలక పాత్ర చేయాలంటూ ప్రశాంత్‌ నీల్‌ రెండేళ్ల క్రితం అడిగారు. కథ కూడా వినిపించారు. కుదరక ఆ సినిమా చేయలేకపోయా. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇస్తాను’’ అని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)అన్నారు. ఆయన కథానాయకుడిగా షాజీ కైలాస్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కడువ’. వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రధారుడు. ఈ నెల 30న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు.  (kaduva movie on 30 june)


పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ మాట్లాడుతూ ‘‘నా గత చిత్రం ‘జనగణమణ’కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడమే కాకుండా చక్కని వసూళ్లు రాబట్టింది. హైదరాబాద్‌లో షూటింగ్‌ అంటే నాకూ ఎప్పుడూ ప్రత్యేకంగా వుంటుంది. నేను నటిస్తున్న ‘బ్రోడాడీ’ సినిమా షూటింగ్‌ అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. మలయాళం నుండి వాస్తవానికి దగ్గరగా ఉండే కథలు, మెదడుకు పదునుపెట్టేవి, ఆలోచన రేకెత్తించే చిత్రాలు ఇలా మంచి కథలతో డిఫరెంట్‌ జానర్‌ చిత్రాలు వస్తున్నాయి. అయితే మాస్‌ కమర్షియల్‌ సినిమాలను మలయాళ పరిశ్రమ మర్చిపోయిందనే భావన కలుగుతోంది. ప్రేక్షకులు అమితంగా ఎంజాయ్‌ చేేస మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ సినిమాలు రావడం తగ్గింది. అందుకే మాస్‌ యాక్షన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఈ సినిమా చేశా. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరిస్తారు. భవిష్యత్తులో నా చిత్రాలన్నీ తెలుగులో విడుదల చేస్తాం. నేను నటించిన చిత్రాలు ఇక్కడ రీమేక్‌ కావడం ఆనందంగా ఉంది. ‘భీమ్లానాయక్‌’ పెద్ద హిట్‌ అయింది. చిరంజీవిగారు నటిస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమల కలయికలో సినిమాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. కథను బట్టే హీరో...

నేను ఒక సినిమా డైరెక్ట్‌ చేయాలంటే ‘హీరోలను దృష్టిలో పెట్టుకోను. కథ డిమాండ్‌ను బట్టే సినిమాలు చేస్తా. పాత్రకు ఎవరు సరిపోతారో వారితోనే సినిమా చేస్తా. నా సినిమా ‘లూసిఫర్‌’ రీమేక్‌ అనుకున్నప్పుడు నా మొదటి ఛాయిస్‌ చిరంజీవిగారే! ఇదే సంగతి ఆయనకూ చెప్పా. నాకున్న కమిట్‌మెంట్స్‌ వల్ల ఆ సినిమాకు దర్శకత్వం చేయడం కుదరలేదు. ‘సైరా’లో ఓ పాత్ర చేయమన్నారు. అప్పుడూ కుదరలేదు. భవిష్యత్తులో అవకాశం వస్తే చిరంజీవిగారితో పనిచేస్తా.(kaduva)


తెలుగు సినిమా ఇండస్ర్టీ బిజినెస్‌ మోడల్‌

ప్రభాస్‌తో ‘సలార్‌’ సినిమా తీస్తున్న ప్రశాంత్‌ నీల్‌, హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మాతలు నాకు ేస్నహితులు. అంతకుమించి  ప్రభాస్‌ నటిస్తున్న సినిమా అది. ఆయన సినిమాలో నటించాలని నాకూ ఉంది. కరోనా కారణంగా మలయాళంలో నేను సైన్‌ చేసిన సినిమాల డేట్స్‌ అన్ని మారిపోయాయి. దాంతో ‘సలార్‌’ చేయలేనని ప్రశాంత్‌ నీల్‌కు చెప్పా. ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కుదిరితే ‘సలార్‌’లో భాగమవుతా. త్వరలో ప్రశాంత్‌ని కలుస్తా. తనతో మాట్లాడాక నేను నటించే విషయంలో క్లారిటీ వస్తుంది. తెలుగు సినిమాలో నటించడమే కాదు దర్శకత్వం కూడా వహిస్తా. ఇప్పటికే కొన్ని నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలొచ్చాయి. అందుకు చాలా ఆనందంగా ఉంది. ఇతర ఇండస్ర్టీలకు తెలుగు సినిమా ఇండస్ర్టీ బిజినెస్‌ మోడల్‌లా నిలిచింది’’ అని అన్నారు. (Prabhas salar). Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International