Prithviraj Sukumaran: ఈ సారి చిరు అడిగితే తప్పకుండా చేస్తా!

Published: Sat, 25 Jun 2022 17:30:21 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Prithviraj Sukumaran: ఈ సారి చిరు అడిగితే తప్పకుండా చేస్తా!

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో అవకాశం అంటే ఏ ఆర్టిస్ట్‌ అయినా, సాంకేతిక నిపుణుడైనా ఎగిరిగంతేస్తారు. మరో ఆలోచన లేకుండా వెంటనే సై అంటారు. ఒక హీరో మాత్రం చిరంజీవి ఆఫర్‌ను వదులుకున్నారు. ఆయనే మలయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌(Prithviraj Sukumaran). అయితే చిరు ఇచ్చిన అవకాశాన్ని ఆయన మిస్‌ చేసుకోవడం ఇది రెండోసారి. మొదటి ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం చిరు బృందం పృథ్వీరాజ్‌ను సంప్రదించారు. అప్పుడాయన నటిస్తున్న మలయాళ చిత్రం షూటింగ్‌  స్పెయిన్‌లో జరుగుతుండడం వల్ల ఆ సమయంలో ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని కేరళలో జరిగిన ‘సైరా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పృథ్వీరాజ్‌ స్వయంగా వెల్లడించారు. 


అయితే ఇప్పుడు మరోసారి చిరు ఇచ్చిన అవకాశాన్ని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ వదులుకున్నారు. ఈ సారి ఆర్టిస్ట్‌గా కాదు.. దర్శకుడిగా! మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన ‘లూసిఫర్‌’(Lucifer) చిత్రానికి పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్‌ ఫాదర్‌’(God father movie)గా రీమేక్‌ చేయాలనుకున్నప్పుడు తొలుత మాతృకను డైరెక్ట్‌ చేసిన పృథ్వీరాజ్‌నే చిరు సంప్రదించారట. అప్పుడు కూడా ఆయన పలు భారీ చిత్రాలతో బిజీ కావడం వల్ల కుదరలేదు. దాంతో చిరు మోహన్‌రాజాను దర్శకుడిగా ఎంచుకున్నారు. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్‌ మాట్లాడారు. ‘‘చిరంజీవి ‘లూసిఫర్‌’ రీమేక్‌ చేయడం ఆనందంగా ఉంది. ఆయన స్టార్‌ ఇమేజ్‌కు కరెక్ట్‌గా సరిపడే కథ. నన్ను దర్శకత్వం వహించమని చిరు అడిగారు. కానీ ఆ సమయంలో నాకు కుదరలేదు. అంతకుముందు ‘సైరా నరసింహ రెడ్డి’లో ఓ పాత్ర కోసం అడిగారు. అప్పుడూ చేయలేకపోయా. భవిష్యత్తులో ‘లూసిఫర్‌ 2 కూడా తీస్తాను. ఈ సినిమాను కూడా చిరంజీవి రీమేక్‌ హక్కులు తీసుకుని డైరెక్షన్‌ చేయమని అడిగితే తప్పకుండా చేస్తాను’’ అని తెలిపారు. (Prithviraj Sukumaran Missed chiranjeevi movies)

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International