30 ఇయర్‌ ఇండ్రస్టీ పృధ్వీరాజ్‌కు బుద్ధి చెప్పింది ఎవరు?

Published: Fri, 25 Mar 2022 18:46:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
30 ఇయర్‌ ఇండ్రస్టీ పృధ్వీరాజ్‌కు బుద్ధి చెప్పింది ఎవరు?

హైదరాబాద్: 30 ఇయర్‌ ఇండ్రస్టీ అంటూ సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను పెంచుకున్న నటుడు పృధ్వీరాజ్‌ అర్థాంతరంగా రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పెట్టారు. గతంలో పృధ్వీరాజ్‌ పుట్‌బాల్‌లా ఎగిరిపడ్డాడు. ఇప్పుడు గతాన్ని తలచుకుంటూ పశ్చాత్తాపడుతున్నారు. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి.. స్వల్పకాలంలోనే చీకటిని చూసిన ఆయన ఇప్పుడు మదనపడుతున్నారు. తన వెనుక పెద్ద కొండ ఉందని భ్రమపడ్డానని అదంతా అబద్ధమని చెప్పారు. పృథ్వీరాజ్ చాలాకాలంగా మీడియాకు దూరంగా ఉన్నారు. వైసీపీకి కూడా దూరంగా ఉన్నారు. తనకు రాజకీయాలు సరిపోవని చిత్ర పరిశ్రమే తనకు దిక్కు అని చెబుతూ వాపోయారు. ఇటీవల పృథ్వీరాజ్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక తాను రాజకీయాలు చేయలేనని, రాజకీయ జీవితంలో బండ చాకిరీ చేశానని, తనకిప్పుడు ఓ గుణపాఠం నేర్పారని తెలిపారు. ఇక రాజకీయాలు దూరంగా ఉంటానని చెబుతున్నారు. అంతటితో ఆగకుండా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవితో పాటు మొత్తం మెగా ఫ్యామిలీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గతంతో పృధ్వీరాజ్‌ పవన్ కల్యాణ్‌పై అనేక విమర్శలు గుప్పించారు. 


30 ఇయర్‌ ఇండస్ట్రీ నటుడు పృధ్వీరాజ్‌కు ఏమైంది?.. ఫ్యాన్‌ గాలికి పృధ్వీరాజ్‌కు రాజకీయ వైరాగ్యం కలిగిందా?.. పృధ్వీరాజ్‌కు బుద్ధి చెప్పింది ఎవరు?.. ఈ ప్రశ్నలకు పృధ్వీరాజే సమాధానాలు చెప్పారు. గతాన్ని తలచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నావెనకాల కొండను చూసి ఇష్టానుసారంగా మాట్లాడాను. చాలా తప్పుడు మాటలు మాట్లాడాను. ఇప్పుడు పెద్దలందరూ ఒక్కటయ్యారు. రాజకీయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత గొప్ప గుణపాఠం వచ్చింది. పవన్ కల్యాణ్ క్యాప్షన్ ఫాలో అవుతున్నాను. ఇది ఆత్మగౌరవానికి, అహంకారానికి మధ్య జరిగే పోరాటం. రాజకీయంగా ఓడిపోయాను. నా వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, పవన్, మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న సమయంలో కూడా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నాకు చిరంజీవి అవకాశం ఇచ్చారు. ఇదే చిరంజీవి గొప్ప మనసుకు నిదర్శనం. బంధువులను స్నేహితులను నమ్మడం లేదు. అన్ని వెన్నుపొట్లను చూశాను. కొవిడ్ సోకినప్పుడు నేను బతుకుతానో లేదో నాకే అనుమానం వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నది చలన చిత్ర పరిశ్రమ మాత్రమే’’ అని పృథ్వీరాజ్ వాపోయారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.