ప్రైవేట్‌ బ్యాంకర్ల వేతనాలు అదరహో..!

ABN , First Publish Date - 2021-07-26T07:17:21+05:30 IST

ప్రైవేట్‌ బ్యాంకర్ల జీతాలు చుక్కలంటుతున్నాయి. సీఈఓలు, చైర్మన్లు, ఎండీల వేతనాలైతే ఇక చెప్పే పనే లేదు. గత ఏడాది బ్యాంక్‌ చీఫ్‌గా రిటైరైన ఆదిత్య పురికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో వేతనం, ఇతర ప్రోత్సాహకాల కింద హెచ్‌డీఎ్‌ఫసీ...

ప్రైవేట్‌ బ్యాంకర్ల వేతనాలు అదరహో..!

  • హెచ్‌డీఎఫ్‌సి మాజీ చీఫ్‌ ఆదిత్య పురి జీతం రూ.13.82 కోట్లు

ముంబై : ప్రైవేట్‌ బ్యాంకర్ల జీతాలు చుక్కలంటుతున్నాయి. సీఈఓలు, చైర్మన్లు, ఎండీల వేతనాలైతే ఇక చెప్పే పనే లేదు. గత ఏడాది బ్యాంక్‌ చీఫ్‌గా రిటైరైన ఆదిత్య పురికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో వేతనం, ఇతర ప్రోత్సాహకాల కింద  హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ ఏకంగా రూ.13.82 కోట్లు చెల్లించింది. ఇందులో రూ.3.5 కోట్లు పోస్ట్‌ రిటైర్మెంట్‌ ప్రయోజనాల రూపంలో ముట్టజెప్పింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశంలో మరే బ్యాంక్‌ చీఫ్‌ ఇంత పెద్ద మొత్తం అందుకోలేదు. ఆదిత్య పురి స్థానంలో గత ఏడాది అక్టోబరులో సీఈఓ, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన శశిధర్‌ జగదీశన్‌కూ 2020-21లో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ జీతం, ప్రోత్సాహకాల రూపంలో రూ.4.77 కోట్లు చెల్లించింది. 

దేశంలో మూడో అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ చీఫ్‌ అమితాబ్‌ చౌదరికి జీతం, ప్రోత్సాహకాల రూపంలో గత ఆర్థిక సంవత్సరం రూ.6.52 కోట్లు ముట్టాయి. కొవిడ్‌ కారణంగా యాక్సిస్‌ బ్యాంక్‌ గత ఏడాది టాప్‌ మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులు ఎవరికీ జీతాలు పెంచలేదు. అయినా అమితాబ్‌ చౌదరి ఈ స్థాయిలో జీతం, ప్రోత్సాహకాలు అందుకోవడం విశేషం. ఇక దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈఓ, ఎండీ సందీప్‌ భక్షి.. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని మూలవేతనం,  కొన్ని ప్రోత్సాహకాలు వదులుకున్నారు. అయినా ఆయనకు ఇతర ఖర్చులు, ప్రోత్సాహకాల రూపంలో రూ.1.01 కోట్లు లభించాయి. 


Updated Date - 2021-07-26T07:17:21+05:30 IST