ప్రై‘వేటు’ - కార్పొ‘రేటు’!

ABN , First Publish Date - 2020-08-07T06:01:10+05:30 IST

కర్మకాలి కాస్త తుమ్మినా-దగ్గినా ‘కరోనా’యే అని తేల్చి ‘ప్రైవేటు కార్పొరేటు’ హాస్పిటళ్లు ఓపిగ్గా ‘ఓ.పి’లో చేర్చి ఓ కంట కనిపెట్టకుండానే కనీస వైద్యం కూడా చేయకుండానే రెండు రోజులకైనా

ప్రై‘వేటు’ - కార్పొ‘రేటు’!

కర్మకాలి కాస్త తుమ్మినా-దగ్గినా

‘కరోనా’యే అని తేల్చి

‘ప్రైవేటు కార్పొరేటు’ హాస్పిటళ్లు

ఓపిగ్గా ‘ఓ.పి’లో చేర్చి

ఓ కంట కనిపెట్టకుండానే

కనీస వైద్యం కూడా చేయకుండానే రెండు రోజులకైనా 

లక్షల బిల్లులకు గురిచేస్తూ

యథేచ్ఛగా దండుకుంటున్నారు,

రోగుల ప్రాణాలతో 

ఆటాడుకుంటున్నారు!

లక్షలు చెల్లిస్తే తప్ప, 

లక్షణంగా అప్పగించని

శవాలతోనూ వ్యాపారం చేస్తున్నారు

దేవుళ్లుగా భావించిన డాక్టర్లూ

దెయ్యాలుగా మారిపోతున్నారు

పాడు డబ్బు వ్యామోహంతో

పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు!

ఈ తీరు మారాలి ఈ జోరు ఆగాలి

చట్టం వీరికి చుట్టంలా గాక

ఇనుపగొట్టంగా మారి దండించాలి.

అమాంతంగా రేటు పెంచుతున్న 

కార్పొ‘రేటు’పై

అమానుషంగా వేటువేస్తున్న ‘ప్రైవేటు’పై

ప్రభుత్వం వెంటనే వేటు వేయాలి,

ప్రజల ప్రాణాల్ని కాపు కాయాలి!


డా. వడ్డేపల్లి కృష్ణ

Updated Date - 2020-08-07T06:01:10+05:30 IST