కోక్‌ ఓవెన్‌ బ్యాటరీల ప్రైవేటీకరణ రద్దుచేయాలి

ABN , First Publish Date - 2022-07-06T06:39:15+05:30 IST

కోక్‌ ఓవెన్‌ బ్యాటరీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దుచేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు గంధం వెంకటరావు అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో 509వ రోజు ఉక్కు రిలే నిరాహార దీక్షల శిబి రంలో పాల్గొన్న కోక్‌ ఓవెన్‌ కార్మికులనుద్దేశించి మంగళవారం మాట్లాడుతూ కర్మాగారంలో కీలక విభాగాలను కేంద్రం పూర్తిస్థాయిలో ప్రైవేటీకరిస్తోందన్నారు.

కోక్‌ ఓవెన్‌ బ్యాటరీల ప్రైవేటీకరణ రద్దుచేయాలి
రిలే దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న గంధం వెంకటరావు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుల డిమాండ్‌   

కూర్మన్నపాలెం, జూలై 5: కోక్‌ ఓవెన్‌ బ్యాటరీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దుచేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు గంధం వెంకటరావు అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో  509వ రోజు ఉక్కు రిలే నిరాహార దీక్షల శిబి రంలో పాల్గొన్న కోక్‌ ఓవెన్‌ కార్మికులనుద్దేశించి మంగళవారం మాట్లాడుతూ కర్మాగారంలో కీలక విభాగాలను కేంద్రం పూర్తిస్థాయిలో ప్రైవేటీకరిస్తోందన్నారు. బ్యాటరీల లో ఎన్నో అవరోధాలున్నా ఉద్యోగులు, కార్మికులు అంకితభావంతో పనిచేస్తూ ఉత్పత్తి సామర్థ్యం పెంచుతున్నారన్నారు. పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలపై కార్మికవర్గం ఐకమత్యంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్రం ఉక్కు కర్మాగారంపై తీసుకున్న నిర్ణయం కరక్టు కాదన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణకు గురికాకుండారాజకీయాలను పక్కన పెట్టి  నేతలంతా ఏకతాటి పైకి వచ్చి ఉద్యమాలకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కె.ఎస్‌.ఎన్‌.రావు, జె.రామకృష్ణ, గంగవరం.గోపి, ప్రసాద్‌, నీరుకొండ.రామచంద్రరావు, ఆనంద్‌, మస్తానప్ప, రామ్మోహన్‌ కుమార్‌, బిసాయ్‌, సన్యాసిరావు, పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T06:39:15+05:30 IST