విషయంలోకి వస్తే.. కొన్ని రోజులుగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తదుపరి చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా సెలక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో దాదాపు రష్మిక కన్ఫర్మ్ అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు ఆమె ప్లేస్‌ను ప్రియాంకా రీ ప్లేస్ చేసిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు స్టార్టయ్యాయి. రష్మికను ఈ సినిమా నుంచి తప్పించడానికి కారణం.. ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషనే అని తెలుస్తోంది. ఆమె స్థానంలో ప్రియాంక అరుల్ మోహన్‌ను చిత్రయూనిట్ దాదాపు ఫైనల్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. సో.. టాలీవుడ్లో పూజా హెగ్డేకు పోటీనిస్తూ.. స్టార్ హీరోల సరసన సినిమాలు దక్కించుకుంటున్న రష్మికకు.. కోలీవుడ్‌లో మాత్రం.. ఓ అప్‌కమింగ్ హీరోయిన్ షాకివ్వడం విశేషమే మరి. దీనిపై రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం.