Sansad TV show యాంకర్ పదవికి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజీనామా

ABN , First Publish Date - 2021-12-06T12:49:18+05:30 IST

వసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజ్యసభ నుంచి సస్పెన్షన్ తర్వాత సంసద్ టీవీ షో యాంకర్ పదవికి రాజీనామా చేశారు....

Sansad TV show యాంకర్ పదవికి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజీనామా

సస్పెన్షన్ పై ఆగ్రహంతో...

న్యూఢిల్లీ: శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజ్యసభ నుంచి సస్పెన్షన్ తర్వాత సంసద్ టీవీ షో యాంకర్ పదవికి రాజీనామా చేశారు. ఎంపీ ప్రియాంక చతుర్వేది శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన తర్వాత సంసద్ టీవీలో ఒక షోకు యాంకర్‌గా తప్పుకున్నారు.పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ‘వికృత’ ప్రవర్తనపై రాజ్యసభ నుంచి పదకొండు మందితో పాటు ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత ప్రియాంక చతుర్వేది సంసద్ టీవీ షో నుంచి వైదొలిగారు.‘‘సంసద్ టీవీ షో మేరీ కహానీ యాంకర్‌గా వైదొలగడం నాకు తీవ్ర వేదన కల్పించింది, మా 12 మంది ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేసిన కారణంగా పార్లమెంటరీ విధులను నిర్వర్తించ లేకపోయాను. అందుకే, నేను రాజ్యసభ టీవీ యాంకర్‌గా తప్పుకుంటున్నాను.’’ అని ప్రియాంక చతుర్వేది రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.


12 మంది విపక్ష ఎంపీలను పార్లమెంటు శీతాకాల సమావేశాల మొత్తానికి రాజ్యసభ నుంచి సస్పెన్షన్ అప్రజాస్వామికమని, ఎగువసభలోని అన్ని నిబంధనలను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షం ఆరోపించింది.సస్పెండ్ అయిన ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, తృణమూల్ కాంగ్రెస్, శివసేనలకు చెందిన ఇద్దరు చొప్పున, సీపీఐ, సీపీఐ(ఎం)లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు రోజంతా నిరసనలు చేపడుతున్న ఎంపీలు తమ సస్పెన్షన్‌ను రద్దు చేసేంత వరకు ప్రతిరోజూ దీక్షలు కొనసాగించాలని నిర్ణయించారు.


Updated Date - 2021-12-06T12:49:18+05:30 IST