ప్రియాంకకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-08-11T08:50:26+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీలో కరోనా కలకలం రేపుతోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేకు మంగళవారం కరోనా సోకగా.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ..

ప్రియాంకకు పాజిటివ్‌

హోమ్‌ ఐసొలేషన్‌లోకి వెళ్లినట్లు వెల్లడి


న్యూఢిల్లీ, ఆగస్టు 10: కాంగ్రెస్‌ పార్టీలో కరోనా కలకలం రేపుతోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేకు మంగళవారం కరోనా సోకగా.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తాజాగా కొవిడ్‌ బారి న పడ్డారు. లక్షణాలు కనిపించ డంతో పరీక్షలు చేయించుకోగా.. బుధవారం పాజిటివ్‌గా తేలిందని ప్రియాంక ట్విటర్లో వెల్లడించారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి హోమ్‌ ఐసొలేషన్‌లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. ప్రియాంకకు కరోనా సోకడం ఇది రెండో సారి. గత ఏడాది జూన్‌లో ఆమె తొలిసారిగా కరోనా బారిన పడ్డారు. అలాగే, కాంగ్రెస్‌పార్టీ కమ్యూనికేషన్‌ విభాగం చీఫ్‌ పవన్‌ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ కూడా తాజాగా వైరస్‌ బారిన పడ్డారు. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. బుధవారం జరగాల్సిన తన రాజస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. సోదరి ప్రియాంక సహా పార్టీలో పలువురు నేతలకు కరోనా సోకడంతో.. ముందుజాగ్రత్త చర్యగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2022-08-11T08:50:26+05:30 IST