ప్రజలకు ఇబ్బందులు సృష్టించడంలో మోదీ ప్రభుత్వం సరికొత్త రికార్డులు : ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2021-10-24T18:55:20+05:30 IST

ప్రజలను ఇబ్బంది పెట్టడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ప్రజలకు ఇబ్బందులు సృష్టించడంలో మోదీ ప్రభుత్వం సరికొత్త రికార్డులు : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : ప్రజలను ఇబ్బంది పెట్టడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సరికొత్త రికార్డులు సృష్టించిందని కాంగ్రెస్ ఉత్తర ప్రదేశ్ శాఖ ఇన్‌ఛార్జి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతుండటంపై మండిపడుతూ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ఈ ధరలు ఈ ఏడాది రూ.23.53 పెరిగినట్లు చెప్తున్న ఓ మీడియా నివేదికను జత చేశారు. 


ప్రజలను ఇబ్బంది పెట్టడంలో మోదీ ప్రభుత్వం భారీ రికార్డులను నమోదు చేసిందని, నిరుద్యోగం అత్యధికంగా ఉందని, ప్రభుత్వ ఆస్తులను అమ్ముతోందని ప్రియాంక పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా కూడా ప్రియాంక ట్వీట్‌లో జత చేసిన మీడియా రిపోర్టును జత చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘మంచి రోజులు’’ అంటూ ఎద్దేవా చేశారు. 


పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు శనివారం కూడా పెరిగాయి. ఢిల్లీలో శనివారం లీటరు పెట్రోలు ధర రూ.107.24 కాగా, లీటరు డీజిల్ ధర రూ.95.97. 



Updated Date - 2021-10-24T18:55:20+05:30 IST