ప్రొ, ప్రి, ఫైటో బయాటిక్స్‌

ABN , First Publish Date - 2021-10-05T18:13:05+05:30 IST

పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొబయాటిక్స్‌తో పాటు, ప్రిబయాటిక్స్‌, ఫైటోబయాటిక్స్‌ కూడా తీసుకోవాలి.

ప్రొ, ప్రి, ఫైటో బయాటిక్స్‌

ఆంధ్రజ్యోతి(05-10-2021)

పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రొబయాటిక్స్‌తో పాటు, ప్రిబయాటిక్స్‌, ఫైటోబయాటిక్స్‌ కూడా తీసుకోవాలి.


ప్రొబయాటిక్స్‌: ప్రొబయాటిక్‌ పదార్థాల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మానసిక ఆరోగ్యానికీ, జీర్ణప్రక్రియకూ తోడ్పడుతుంది. కాబట్టి  ప్రొబయాటిక్స్‌ ఉండే పెరుగు తింటూ ఉండాలి.


ప్రిబయాటిక్స్‌: పేగుల్లోని బ్యాక్టీరియా పులిసేలా చేసి, జీర్ణం చేసుకోగలిగే పీచు, పిండిపదార్థాలు ప్రిబయాటిక్స్‌లో ఉంటాయి. ఇవి మంచి బ్యాక్టీరియా శక్తిని అందించి, వాటి ఎదుగుదలకు తోడ్పడతాయి. కాబట్టి ఇవి పుష్కలంగా దొరికే యాస్పరాగస్‌, అరటిపళ్లు, ఆకుకూరలు, ఉల్లి, వెల్లుల్లి, అల్లం, చికొరీ, ఆర్టిచోక్స్‌ తీసుకుంటూ ఉండాలి.


ఫైటోబయాటిక్స్‌: మంచి బ్యాక్టీరియాకు రక్షణ కల్పించి, వాటి ఎదుగుదలకు తోడ్పడంతో పాటు చెడు బ్యాక్టీరియాను తరిమికొట్టే ఫ్లేవనాయిడ్లు వీటిలో ఎక్కువ. కాబట్టి ఫైటోబయాటిక్స్‌ దొరికే యాపిల్స్‌, ద్రాక్ష, డార్క్‌ చాక్లెట్‌, బెర్రీలు తింటూ ఉండాలి.


Updated Date - 2021-10-05T18:13:05+05:30 IST