‘సెక్రటరీ సార్‌.. సమస్యలు పరిష్కరించండి’

ABN , First Publish Date - 2021-03-06T06:09:44+05:30 IST

వార్డుల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తాటిపాక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం 5,7,12 వార్డు సభ్యులు గటిగంటి మీనాక్షి, నాగిరెడ్డి గోపివెంకటకృష్ణ, సూదా సుందరం, స్థానికులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు.

‘సెక్రటరీ సార్‌.. సమస్యలు పరిష్కరించండి’

రాజోలు, మార్చి 5: వార్డుల్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ తాటిపాక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం  5,7,12 వార్డు సభ్యులు గటిగంటి మీనాక్షి, నాగిరెడ్డి గోపివెంకటకృష్ణ,  సూదా సుందరం, స్థానికులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం వార్డు సభ్యులు, స్థానికులు సెక్రటరీ బి.శ్రీహరికి  వినతిపత్రం అందజే శారు. సెక్రటరీ సార్‌ మా వార్డుల్లో సమస్యలు  పరిష్కరించాలని నినాదాలు చేశారు. వీధి దీపాలు, మంచినీటి కుళాయిలు మర మ్మతులు చేయాలని, పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు.


Updated Date - 2021-03-06T06:09:44+05:30 IST