ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

ABN , First Publish Date - 2021-10-27T05:15:20+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికులు, ప్ర జా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని ఏఐటీయూసీ రాష్ట్ర వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.రాధాకృష్ణమూర్తి పేర్కొన్నా రు.

ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాధాకృష్ణమూర్తి 


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 26 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికులు, ప్ర జా వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని ఏఐటీయూసీ రాష్ట్ర వ ర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.రాధాకృష్ణమూర్తి పేర్కొన్నా రు. మంగళవారం ఒంగోలులోని మల్లయ్యలి ంగంభవన్‌లో జిల్లా కార్యవర్గ సమావేశానికి జి ల్లా అధ్యక్షుడు బూసి సురేష్‌బాబు అధ్యక్షత వ హించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ కార్మికులు అనేక పోరాటాల ద్వా రా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్‌లుగా తీసుకువచ్చి కార్మికుల ను కట్టుబానిసలుగా చేస్తుందని ఆరోపించారు. రైతులను కూలీలుగా మార్చే మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌.నారాయణ మాట్లాడుతూ మా నిటైజేషన్‌ పైపులైన్‌ పేరుతో ప్రభుత్వ రంగ సం స్థలను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మేందుకు ప్ర యత్నాలు చేస్తుందన్నారు. జిల్లా ప్రధాన కార్య దర్శి పీవీఆర్‌.చౌదరి మాట్లాడుతూ ఒంగోలులో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు వచ్చేనెల మొదటి వారంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌డీ.సర్దార్‌, బత్తుల శామ్యేల్‌, జీవరత్నం, జి.బాలిరెడ్డి, కె.హనుమంతరావు, కె. సుభాన్‌నాయుడు, కె.వెంకటేశ్వర్లు, కేఎల్‌డీ.ప్ర సాద్‌, కె.అంజయ్య, బీఈ.రవి, సీహెచ్‌.వెంకటేశ్వ ర్లు, కె.చినఅంజయ్య తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-27T05:15:20+05:30 IST