పాఠశాలల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-07-07T05:54:39+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ మురళికృష్ణ ఆరోపించా రు.

పాఠశాలల్లో సమస్యలు వెంటనే పరిష్కరించాలి
డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు

నల్లగొండటౌన, జూలై 6: ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ మురళికృష్ణ ఆరోపించా రు. వెంటనే పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశా రు. ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మన ఊరు-మనబడి అనే కార్యక్రమా న్ని తీసుకువచ్చి పాఠశాలలను పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆ దిశగా ప్ర యత్నాలు జరగడం లేదని ఆరోపించారు. విద్యార్థులకు నేటికి పాఠ్యపుస్తకాలు, యూ నిఫాంలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్‌, ప్రైవేటు విద్యాసంస్థల్లో అడ్డూ, అదుపు లేకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూళ్లు చేస్తుంటే అ ధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. లేనిచో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఈవో భిక్షపతికి వి న తిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బరిగల వెంకటేష్‌, జి ల్లా సహాయ కార్యదర్శి ఇరిగి ప్రవీణ్‌, కోశాధికారి గాదెపాక సూర్యతేజ, నాయకులు   విప్లవ్‌కుమార్‌, వినయ్‌, సంశుద్దిన, తేజ, యశ్వంత, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-07T05:54:39+05:30 IST