గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-08T05:58:46+05:30 IST

గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని సర్పం చులు, ఎంపీటీసీలు డి మాండ్‌ చేశారు.

గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సునీత

డిండి, ఆగస్టు 7:  గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని సర్పం చులు, ఎంపీటీసీలు డి మాండ్‌ చేశారు. ఎంపీపీ సునీతజనార్ధనరావు అ ధ్యక్షతన జరిగిన సర్వస భ్య సమావేశంలో సమస్యలను ప్రజాప్రతినిధు లు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి సమస్య, మిషన భగీరథ సమస్యలపై చర్చించారు. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీలకు మొదటి, రెండో విడతల్లో  పంచాయతీ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించినట్లు పీఆర్‌ఏఈ విజయ్‌కుమార్‌ తెలిపారు. డిండిలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి రూ.10లక్షలు బిల్లులు రావాల్సి ఉందని ఎంపీటీసీ వెంకటయ్య తెలిపారు.  గత సమావేశంలో చర్చకు వచ్చిన సమస్యలను తిరిగి సమావేశం నిర్వహించే సమయానికి పరిష్కరించాలని ఎంపీపీ సూచించారు. అన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ ప్రశాంత, వీరప్ప, ఎండీవో డానియేలు, వైస్‌ఎంపీపీ పుల్లమ్మ, కోఆఫ్షన సభ్యులు జాహంగీర్‌, సర్పంచల పోరం అధ్యక్షులు దామోదర్‌రావు, శేఖర్‌రెడ్డి, వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:58:46+05:30 IST