సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-01-22T05:22:01+05:30 IST

మాదారి కురువ, మాదాసి కురువలకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యస్వరూప్‌ డిమాండ్‌ చేశారు.

సమస్యలు పరిష్కరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు సత్యస్వరూప్‌

- మాదారి కురువ, మాదాసి కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యస్వరూప్‌



నారాయణపేట టౌన్‌, జనవరి 21: మాదారి కురువ, మాదాసి కురువలకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యస్వరూప్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సత్యనారా యణ స్వామి దేవాలయంలో జిల్లా కన్వీనర్‌ ప్రభాకర్‌వర్ధన్‌ అధ్యక్షతన మాదారి కురువ, మాదాసి కురువ సంఘం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించగా, రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. మాదారి కురువ, మాదాసి కురువలకు జీఓ1268 అమలు చేయాలని, జాతీయ కమిషన్‌ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈనెల 23న హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి జిల్లా నుంచి మాదారి కురువ, మాదాసి కురువలు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మాదా రి కురువ, మాదాసి కురువలకు సంబందించిన 2020 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, నాయకులు ఎల్లయ్య, మల్లయ్య, రాములు, వేణుగోపాల్‌, డా.సా యిబాబా, సుధాకర్‌, నాగరాజ్‌, వినోద్‌, సుదర్శన్‌, ఊ సెనప్ప, రాము, రాములు, నవీన్‌ తదితరులు పాల్గొ న్నారు.

Updated Date - 2022-01-22T05:22:01+05:30 IST