శివారు ప్రాంతాలపై శీతకన్ను

ABN , First Publish Date - 2022-01-22T05:09:11+05:30 IST

మునిసిపల్‌ పరిధిలోని శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు మృగ్యమయ్యాయి.

శివారు ప్రాంతాలపై శీతకన్ను
1వ వార్డులో సీసీ రోడ్డుకు నోచుకోని రహదారి

మౌలిక వసతులు లేక ప్రజల ఇక్కట్లు

పట్టించుకోవాలని విన్నపాలు

చీరాలటౌన్‌, జనవరి21: మునిసిపల్‌ పరిధిలోని శివారు ప్రాంతాల్లో మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. మునిసిపల్‌ పరిధిలో 33 వార్డులున్నాయి. వీటిలో 1వ వార్డు, 23వ వార్డు యానాదికాలనీ, 25వ వార్డు ప్రకా్‌షనగర్‌లు పట్టణానికి శివారున ఉన్నాయి. సరఫరా కాని తాగునీరు, పారుదల లేని డ్రైనేజీతోపాటు సీసీరోడ్లు లేమి వంటి సమస్యలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 1వ వార్డులో పారిశుఽధ్య పనులు బాగానే ఉన్నా, తాగునీరు సమస్య వేధిస్తోంది. ఈ వార్డులో మంచినీటి పైపులు వేశారుగానీ ట్యాపులు అమర్చలేదు. వార్డులో అధిక సంఖ్యలోనే సీసీ రోడ్లు నిర్మాణం అవసరం ఉన్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వార్డులో రెండు ఇళ్లవారు మాత్రమే మంచినీటి కొళాయిలు బిగించుకున్నారు. అప్పుడప్పుడు  నీరు వచ్చినప్పుడు ఇంటి యజమానుల బతిమలాడుకుని నీళ్లు పట్టుకుంటున్నట్లు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

23వ వార్డు యానాది కాలనీలో పారుదల లేని డ్రైనేజీలో దర్శనమిస్తున్నాయి. ఈ వార్డు లోతట్టు ప్రాంతం. వర్షం అధికంగా కురిస్తే డ్రైనేజీలు నిండి వ్యర్థాలు ఇళ్లల్లోకి చేరతాయి. అంతేకాకుంగా వార్డులో అంతర్గత కాలువలు అధ్వానంగా మారాయి.  పేరుకుపోయిన వ్యర్థాల తో పలుప్రాంతాలు దోమల ఆవాసాలుగా మారాయి. 

25 వార్డుపరిధిలోని ప్రకాష్‌ నగర్‌లో ఇళ్ల మధ్యలో ఉన్న దేవుడి మాన్యం స్థలం చెరువును తలపిస్తోంది. ఇటీవల వర్షాలకు అందులో నీటి శాతం బాగా పెరిగింది. చెరువు నుంచి మురుగు పెరిగి దుర్వాసనలు వెదజల్లుతున్నాయి. దోమలు విజృంభిస్తున్నాయి. వ్యాధులు సోకి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

తాగునీటికి పాట్లు

మొగిలి వెంకటేశ్వర్లు, 1వ వార్డు 

వార్డులో పైపులు వేశారు. ట్యాపులు మరిచారు. తాగునీరు కోసం నిత్యం తిప్పలు తప్పడం లేదు. అంతేకాకుండా వార్డులో అధిక సంఖ్యలో సీసీ రోడ్లు నిర్మాణం జరగాల్సి ఉంది. అధికారులు ఇటువైపు కన్నెత్తికూడా చూడటం లేదు. 

దుర్వాసనతో అవస్థలు

 లక్ష్మీ, ప్రకా్‌షనగర్‌  

వార్డులో దేవుడి మాన్యం స్థలంలో మురుగునీరు పెరిగి చెరువైంది. దు ర్వాసనలకు ఉండలేక అవస్థలు పడుతున్నాం. మరోవైపు వ్యర్థ జలాల నుంచి వాసన భరించలేక పోతున్నాం. అధికారులు స్సందించి ప్రజల ఇబ్బందు లను తొలగించాలి.

Updated Date - 2022-01-22T05:09:11+05:30 IST