వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-07-27T06:01:08+05:30 IST

గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)కు కనీస వేతనాలు అందించాలని, నామినీలను వీఆర్‌ఏలుగా నియమించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావులు డిమాండ్‌ చేశారు.

వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలి
సమస్యలను పరిష్కరించాలటూ నినాదాలు చేస్తున్న వీఆర్‌ఏలు

సీఐటీయూ నాయకులు డిమాండ్‌

సిరిపురం, జూలై 26: గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ)కు కనీస వేతనాలు అందించాలని, నామినీలను వీఆర్‌ఏలుగా నియమించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్‌ తాము అధికారంలోకి వస్తే వీఆర్‌ఏలకు కనీస వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదన్నారు. ఏళ్ల తరబడి రూ.పది వేల వేతనంతోనే పనిచేస్తున్నారని, అనారోగ్యం పాలైన వీఆర్‌ఏల స్థానంలో వారి వారసులు నామినీలుగా పనిచేస్తున్నారని.. వీరందరీనీ పూర్తి స్థాయి వీఆర్‌ఏలుగా నియమించాలన్నారు. అలాగే వీఆర్‌ఏలకు వీఆర్‌వోలుగా ప్రమోషన్లు ఇవ్వాలని, అర్హులైన వీఆర్‌ఏలకు క్లాస్‌-4 ఉద్యోగాలివ్వాలని, డీఏను వేతనం నుంచి మినహాయించడాన్ని విరమించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలంటూ వీఆర్‌ఏలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎం.సంతోష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి కె.లోవరాజు, అధ్యక్షుడు డి.చిన్న అప్పారావు, జి.సత్యనారాయణ, పి.వెంకటరావు, పి.సత్తిబాబు, తదితరులతో పాటు పెద్దసంఖ్యలో వీఆర్‌ఏలు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T06:01:08+05:30 IST