పక్కా ఇళ్ల విధివిధానాలు తయారవుతున్నాయి: సండ్ర

ABN , First Publish Date - 2022-07-06T05:33:26+05:30 IST

అర్హులైన నిరుపేదలకు పక్కా ఇళ్ల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

పక్కా ఇళ్ల విధివిధానాలు తయారవుతున్నాయి: సండ్ర
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి, జూలై 5: అర్హులైన నిరుపేదలకు పక్కా ఇళ్ల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేసారు. ఆయన మాట్లాడుతూ త్వరలో పక్కా ఇళ్ల పథకం ప్రారంభమవుతుందని చెప్పారు. రెవెన్యూ సమస్యలకు సంబంధించి త్వరలో గ్రామా స్థాయిలో సమావేశాలు నిర్వహించి సమస్యలు పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ త్వరలో పింఛన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ నాయత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది దేశానికే రోల్‌ మోడల్‌ అని చెప్పారు. తెలంగాణాలో రోడ్లను చూసి అభివృద్ది ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చన్నారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వెళితే అక్కడి రోడ్లు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడక ముందు ఆ తరువాత అభివృద్ధిని ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని కోరారు. సరిహద్దు రాష్ర్టాల్లో గ్రామాల వారు తమ గ్రామాలను తెలంగాణాలో కలపాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఇక్కడ చారిత్రాత్మక అభివృద్ది జరుగుతూంటే మరో పక్క విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో రాష్ట్ర విభజన హామీల గురించి మాట్లాడటం లేదని, బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ప్యాక్టరీ, గిరిజన యూనివర్శిలు ఏమయ్యాయని బీజేపీని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. రాష్ట్రంలలో జరిగే అభివృద్దిపై త్వరలో అన్ని ప్రాంతాల్లో డిజిటల్‌ బోర్డులలు పెట్టనున్నట్లు చెప్పారు.

రూ.24.54లక్షల చెక్కుల పంపిణీ

నియోజకవర్గానికి చెందిన 45మందికి  మంజూరయిన రూ.14.54లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే సండ్ర పంపిణీ చేశారు. వీటితో పాటు ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్తలు అయిదుగురు కుటుంబాలకు రూ.రెండు లక్షల చొప్పున రూ.పదిలక్షల విలువైన చ ఎక్కులను పంపిణీ చేశారు. 


Updated Date - 2022-07-06T05:33:26+05:30 IST