అలంపూర్‌లో పీర్ల ఊరేగింపు

ABN , First Publish Date - 2022-08-08T05:08:34+05:30 IST

పట్టణం కేంద్రంలోని ఆలంపూర్‌లో ఆదివారం పీర్ల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అలంపూర్‌లో పీర్ల ఊరేగింపు
అలంపూరు పట్టణంలో ఊరేగింపుగా వెళ్తున్న పీర్లు

అలంపూరు, ఆగస్టు 7 : పట్టణం కేంద్రంలోని ఆలంపూర్‌లో ఆదివారం పీర్ల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  పోస్టాఫీస్‌ కాలనీలోని షాలీ ఫైల్వాన్‌, సింగవరం పీర్లు, పెద్ద  షాలీ ఫైల్వాన్‌ తదితర పీర్లు పట్టణంలో భారీగా ఊరేగింపు చేపట్టారు. ఈ పీర్లను చూసేందుకు హిందూ,ముస్లింలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఊరేగింపు అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పీర్లు ఆలింగనం చేసుకోగా అధిక సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు పీర్ల సంబురాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు తమ కానుకలను పీర్లకు అందజేశారు.  

Updated Date - 2022-08-08T05:08:34+05:30 IST