'లవ్ స్టోరి' రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ

Jun 16 2021 @ 13:26PM

అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా తెరకెక్కిన సినిమా 'లవ్ స్టోరి'. ఈ సినిమా రిలీజ్‌పై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరిగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 16న థియేటర్స్ రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మేకర్స్ పోస్ట్‌పోన్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతూ, సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఈ నెల చివరి నుంచి తెలుగు రాష్ట్రాల్లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్స్  ఓపెన్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. దాంతో 'లవ్ స్టోరి' విడుదల విషయంలోనూ సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ కారణంగా చిత్ర నిర్మాతలలో ఒకరైన సునీల్ నారంగ్ తాజా ఇంటర్వ్యూలో సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే ఈ సినిమాను థియేటర్లలో విడుదల అవుతుందని అన్నారు. 'థియేటర్లలో రోజుకు 3 ప్రదర్శనలకు మాత్రమే అనుమతిస్తే, మాత్రం మా సినిమా రిలీజ్ చేయాలనీ అనుకోవట్లేదు. నైట్ కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాతే విడుదల గురించి ఆలోచిస్తాము. జూలై రెండవ వారం తర్వాత మాత్రమే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని నా అభిప్రాయం. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తాము'.. అని సునీల్ నారంగ్ వెల్లడించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.