ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయసాధనకు పునరంకితం కావాలి

ABN , First Publish Date - 2021-06-22T07:11:18+05:30 IST

తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయసాధనకు ప్రతీఒక్కరూ పునరంకితం కావాలని అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయసాధనకు పునరంకితం కావాలి
జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న మంత్రి

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 21 : తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్‌ జయశంకర్‌ ఆశయసాధనకు ప్రతీఒక్కరూ పునరంకితం కావాలని అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జయశంకర్‌సార్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిబాటలో పయనిస్తోంది అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. బంగారు తెలంగాణదిశగా అడుగులు వేస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని స్పష్టం చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కె.విజయలక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ జి.ఈశ్వర్‌ జయశంకర్‌కు నివాళులు అర్పించారు. నాయ కులు రాంకిషన్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, రైతు సహకార సంఘం అధ్యక్షుడు రాజేందర్‌, కమిషనర్‌ బాలకృష్ణ, కోటగిరి అశోక్‌, మేడారం ప్రదీప్‌, తదితర నాయకులు పాల్గొన్నారు. 

డ్రైనేజీ పనులను పరిశీలించిన మంత్రి 

నిర్మల్‌ టౌన్‌, జూన్‌ 21 : నిర్మల్‌ పట్టణం గాజులపేట్‌ 35వ వార్డులో జరుగుతున్న మురికి  కాలువల నిర్మాణ పనులను సోమవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం అయిన నిర్మల్‌ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, గాజులపేట్‌ చౌరస్తా నుండి ఆలూర్‌ గ్రామం వరకు గాజులపేట్‌, లంగ్డాపూర్‌, వెంగ్వాపేట్‌ మీదుగా ఆలూర్‌ వరకు 4 కోట్ల పైగా వ్యయంతో డబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టామని తెలిపారు. మొదటగా డ్రైనేజీ పనులు పూర్తి చేసి రహదారి పనులు పూర్తి చేస్తామ న్నారు. డ్రైనేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఆలూర్‌ వరకు డబుల్‌ రోడ్డు వేసి మధ్యలో డివైడర్‌ ఏర్పాటు చేసి లైట్లు పెట్టడం జరుగు తుందన్నారు. త్వరలోనే పనులు పూర్తి అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్‌ కొరిపెల్లి రాంకిషన్‌ రెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎస్‌కే. సాజిద్‌, కౌన్సిలర్స్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

నిర్మల్‌లో మాజీ ప్రధాని పీవీ విగ్రహం ఏర్పాటు 

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 21 : నిర్మల్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయనతో కలిసిఉద్యమంలో పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సమాజం ఆయనను ఎన్నడూ మరువదని అన్నారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. 

మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన దళిత సంఘాల నాయకులు

నిర్మల్‌ కల్చరల్‌, జూన్‌ 21 : నిర్మల్‌లో అంబేద్కర్‌ భవన నిర్మాణానికి అద నంగా రూ. కోటిన్నర మంజూరు చేయించిన సందర్భంగా దళిత సంఘాల నాయకులు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని ఆయన నివాసంలో సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆరునెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా మంత్రి హమీ ఇచ్చారు. రాజేశ్వర్‌, బొడ్డు లక్ష్మణ్‌, ప్రభాకర్‌, కే. వెంకటస్వామి, సిద్ధ ముత్యం మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, మారుగొండ రాము, రామకృష్ణారెడ్డి, ఎంసీ లింగన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T07:11:18+05:30 IST