స్టూడెంట్‌ను ప్రేమలో పడేసిన గురువు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. బలవంతంగా అబార్షన్.. చివరకు..

ABN , First Publish Date - 2022-02-03T22:35:42+05:30 IST

అతను ఓ కళాశాలలో ఉపాధ్యాయుడు.. అదే కళాశాలలో చదువుకుంటున్న యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు..

స్టూడెంట్‌ను ప్రేమలో పడేసిన గురువు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం.. బలవంతంగా అబార్షన్.. చివరకు..

అతను ఓ కళాశాలలో ఉపాధ్యాయుడు.. అదే కళాశాలలో చదువుకుంటున్న యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు.. ఫేస్‌బుక్ ద్వారా ఆ అమ్మాయితో మాటలు కలిపాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. ఆ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది.. దాంతో అతను బలవంతంగా అబార్షన్ చేయించాడు.. చివరకు అతని బండారం బయటపడడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.. గురువుపై అత్యాచారం కేసు పెట్టింది..  


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఉన్న డీఏవీ కళాశాలలో రవి కుమార్ అనే వ్యక్తి ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే కాలేజ్‌లో చదువుతున్న యువతితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో ఆమెను ట్రాప్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆ విషయం తెలియడంతో బలవంతంగా ఆమెకు అబార్షన్ చేయించాడు. అప్పట్నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. 


గతేడాది డిసెంబర్ 26న వివాహం చేసుకోమని కాళ్లు పట్టుకుని అడిగితే.. అందుకు తిరస్కరించి అక్కణ్నుంచి వెళ్లిపోయాడు. బాధిత యువతికి సంబంధించిన అసభ్యకర వీడియోను నెట్‌లో పెడతానని బెదిరించాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. రవి కుమార్‌పై అత్యాచారం కేసు పెట్టింది. విషయం తెలుసుకున్న రవికుమార్ పరారయ్యాడు. పోలీసులు ప్రస్తుతం రవికుమార్ కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-02-03T22:35:42+05:30 IST