విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న దృశ్యం
ఆదిలాబాద్ టౌన్, మార్చి 27: విద్యార్థుల్లో మూఢనమ్మకాలను తొలగించి శాస్ర్తీయత పెంపొందించేలా కార్యక్రమాలను చేపడుతున్నామని జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు సంతోష్‌కుమార్ అన్నారు. ప్రస్థుతం ప్రభుత్వ గురుకులాల పాఠశాల ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలను దృస్టిలో ఉంచుకుని ఆదివారం ప్రభుత్వ కోలాం ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో మెజీషియన్ మేస్రం రాజు వివిధ రకాల మ్యాజిక్‌లను చూపించి పిల్లలను ఆనందపరిచారు. దెయ్యం, మూఢనమ్మకాలు లాంటి అంశాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. ఇటీవల మామిడిగూడ ఆశ్రమ పాఠశాల్లో దెయ్యం ఉందని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారని, రెండురోజుల క్రితం జైనథ్ మోడల్ పాఠశాల ఎదుట ఎవరో క్షుద్ర పూజ చేస్తున్నారన్న సంఘటనలు ముందుకు వస్తున్నాయని జనవిజ్ఞన వేదిక అధ్యక్షుడు సంతోష్‌కుమార్ అన్నారు. మూఢ నమ్మకాలు పాతుకుపోవడం కారణంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. ఇందులో జేవీవీ ప్రధాన కార్యదర్శి నూతుల రవీందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం నారాయణరావ్, తదితరుల పాల్గొన్నారు.